https://oktelugu.com/

Mosquitoes : దోమలు చిరాకు తెప్పిస్తున్నాయా? ఇలా పంపించేయండి..

కర్పూరం దోమల నుంచి దూరం చేస్తుంది. ఇంట్లో తలుపులు, కిటికీలు మూసి వేసి కర్పూరాన్ని కాల్చాలి. ఇలా చేయడం వల్ల వాటి వాసనకు దోమలు బయటకు వెళ్ళిపోతాయి.

Written By:
  • NARESH
  • , Updated On : August 11, 2024 / 03:55 AM IST

    This is how to repel Mosquitoes

    Follow us on

    Mosquitoes : వామ్మో వర్షాకాలం వచ్చింది దోమలు మొదలు అయ్యాయి. ఈ దోమలు కుట్టి డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి ఎన్నో వ్యాధులను తెచ్చిపెడుతాయి. వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం కొన్ని టిప్స్ పాటించాలి. లేదంటే వీటి కాటుకు బలి అవ్వాల్సిందే. అయితే దోమల నుంచి కాపాడుకోవడానికి చాలా మంది కాయిల్స్, లిక్విడ్స్ వాడతారు. కానీ అందరికీ ఇవి వీటి స్మెల్ పడదు. మరి నేచురల్ గా దోమలను పోగొట్టుకోవడం ఎలా అనుకుంటున్నారా? అయితే చదివేసేయండి.

    మొక్కలు:
    చెట్లు పెంచే అలవాటు ఉంటే బంతిపూలు, తులసి, లావెండర్, లెమన్ గ్రాస్, పిప్పర‌మెంట్, రోజ్మేరీ వంటి మొక్కలను ఎంచుకోండి. ఈ మొక్కలకు దోమలు దూరంగా ఉంటాయి. కానీ మరొకొన్ని మొక్కలకు మాత్రం దోమలు మరింత ఎక్కువ వస్తాయి. అలాంటివి తెలుసుకొని కట్ చేస్తూ ఉండండి. గడ్డి పెరగకుండా చూసుకోవాలి.

    వెల్లుల్లి: వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ కంటెంట్ దోమలను దూరం చేస్తుంది. వెల్లుల్లి రసం కీటకాలని దూరం చేస్తుంది. వెల్లుల్లి రెబ్బల్ని నీటిలో ఉడికించి చల్లార్చి.. ఆ నీటిని స్ప్రే బాటిల్‌లో పోసి స్ప్రే చేస్తే ఈ ఘాటు వాసనకి దోమలు రావు.వెల్లుల్లి వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. శరీరానికి మాత్రమే కాదు చర్మానికి హానీ చేసే దోమలను కూడా ఇవి పారదోలుతాయి.

    కర్పూరం.. కర్పూరం దోమల నుంచి దూరం చేస్తుంది. ఇంట్లో తలుపులు, కిటికీలు మూసి వేసి కర్పూరాన్ని కాల్చాలి. ఇలా చేయడం వల్ల వాటి వాసనకు దోమలు బయటకు వెళ్ళిపోతాయి. ప్రతి 2, 3 రోజులకి ఓ నీటి గిన్నెలో కర్పూరం మాత్రలు వేసి ఉంచినా సరే దోమలు రావు.

    ఆరోమేటిక్ ఎసెన్షియల్ ఆయిల్స్.. ఎసెన్షియల్ ఆయిల్స్ అయిన లావెండర్, టీట్రీ, యూకలిప్టస్, పుదీనా ఎసెన్షియల్ లతో దోమలని తరిమికొట్టొచ్చు. ఓ స్ప్రే బాటిల్‌లో ఎసెన్షియల్ ఆయిల్స్‌ ను నింపి వాటిని ఇంట్లో స్ప్రే చేయాలి. లేదంటే ఇందులో కొబ్బరి నూనెను కలిపి కూడా వాడవచ్చు. వీటిలో కీటక నిరోధక లక్షణాల ఉంటాయి కాబట్టి దోమలు దరిచేరవు.

    నిమ్మ, లవంగం.. నిమ్మకాయను సగానికి కట్ చేసి అందులో కొన్ని లవంగాలను గుచ్చాలి. వీటిని మీ ఇంట్లో అక్కడక్కడ పెట్టడం వల్ల దోమలు ఇంట్లోకి రావు. ఇందులోని లవంగంలో యాంటీ బ్యాక్టీరియల్,, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ పెరేటిక్, యాంటీ కాండిడల్ గుణాలు దోమలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి.

    ఈ సింపుల్ టిప్స్ లో ఎలాంటి టిప్ ను మీరు ఉపయోగించినా సరే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా, ఫ్లూ వంటి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. వర్షాకాలంలో వచ్చే ఈ వ్యాధుల నుంచి దూరంగా ఉండటానికి దోమలకు దూరంగా ఉండాలి. దోమలకు దూరంగా ఉండాలంటే వాటిని ఇంట్లోకి రానివ్వకూడదు. మరి పైన తెలిపిన టిప్ లో ఒక టిప్ ను మీరు ఉపయోగించినా మంచి ఫలితాలు ఉంటాయి. ట్రై చేయండి. దోమలను తరిమివేయండి.