Relationship: వివాహం అనేది ఒక గొప్ప బంధం. ఇక ఈ బంధాన్ని సంతోషంగా సాగించాలి అంటే ప్రేమ, నమ్మకం అంకితభావం చాలా అవసరం. కానీ కొన్నిసార్లు పరిస్థితులు ఈ సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. సంబంధంలో చిన్న చిన్న వాదనలు, విభేదాలు సాధారణం. కానీ కొన్నిసందర్భాల్లో మాత్రం ఈ రిలేషన్ ను కంటిన్యూ చేయడం కష్టంగా మారుతుంది. మరి అలాంటి సందర్భం ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంకేతాలు మీ వివాహంలో కనిపిస్తే, దాన్ని కాపాడుకోవడానికి మీరు ఏమి చేయగలరో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైనట్టే..
1. నిరంతర తగాదాలు..మీ దాంపత్యంలో ప్రతి చిన్న విషయం వాదించడం వరకు వెళ్తుందా? ఈ వాదనలు గొడవలుగా మారుతున్నాయా? అయితే ఇది మీకు ఆందోళన కలిగించే విషయం అన్నట్టే. తగాదాలు చాలా ఎక్కువగా ఉంటే అవి మిమ్మల్ని కంటిన్యూగా బాధ పెడుతుంటే మీరు చాలా డేంజర్ లో ఉన్నట్టే. ఇక భాగస్వాములిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఒకరినొకరు నిందించుకోవడం ప్రారంభిస్తే మాత్రం మీ రిలేషన్ త్వరలోనే బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది.
2. మాట్లాడటంలో ఆసక్తి..
మంచి సంబంధానికి పునాది కమ్యూనికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. మీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడకుండా సిగ్గుపడటం, గొడవలు పడటం, కోపంతో ఉండటం వంటివి చేస్తుంటే కూడా మీరు జాగ్రత్త పడాలి. సమయం పెరుగుతున్న కూడా మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందంటే మీ రిలేషన్ త్వరలోనే బ్రేక్ అవుతుందని అర్థం.
3. ట్రస్ట్ లేకపోవడం
సంబంధంలో అత్యంత ముఖ్యమైన అంశం నమ్మకం. మీ ఇద్దరి మధ్య అనుమానం అనేది ఉంటే అసలు లైట్ తీసుకోవద్దు. నమ్మకం లేకుండా సంబంధం ఎక్కువ కాలం కొనసాగదు.
4. మీ భవిష్యత్ ప్రణాళికలో మీ భాగస్వామికి చోటు.. మీ భవిష్యత్ ప్రణాళికలో మీ భాగస్వామిని చేర్చుకోవడం మర్చిపోవడం లేదా ఉద్దేశపూర్వకంగా వారికి చోటు కల్పించకపోవడం వంటివి చేస్తుంటే మీ రిలేషన్ ఎండింగ్ స్టేజ్ లో ఉందని అర్థం చేసుకోవచ్చు.
5. ఎమోషనల్- ఫిజికల్ దూరం:
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక దూరం పెరగిందా? అంటే మీరు ఒకరితో ఒకరు సమయం గడపడం మానేసారా? ఇక మీ సంబంధం బలహీనపడిందని అర్థం.
ఏం చేయాలి?
మీ సంబంధంలో ఈ సంకేతాలలో కొన్ని కనిపించినా సరే దాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. ఒకరితో ఒకరు మాట్లాడండి, ప్రొఫెషనల్ కౌన్సెలర్ నుంచి సహాయం తీసుకోండి. మీ సంబంధంలో ప్రేమ, నమ్మకాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించండి. అయితే, విషయాలు నియంత్రణలో లేనట్లయితే, మీ రిలేషన్ కు ఎండ్ చెప్పడం బెటర్ అంటున్నారు నిపుణులు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..