https://oktelugu.com/

Thyroid: ఇలా చేస్తే థైరాయిడ్ అసలు రాదు

థైరాయిడ్‌కు ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఒకప్పుడు సాంప్రదాయ వంటకాలు మాత్రమే తినేవారు. ఇప్పుడు మొత్తం మాడ్రన్ అన్నట్టుగా మారాయి ఆహారపు అలవాట్లు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 16, 2025 / 03:00 AM IST

    Thyroid

    Follow us on

    Thyroid: గత కొన్నేళ్లుగా దేశంలో థైరాయిడ్ రోగుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా మహిళల్లో థైరాయిడ్ కేసులు పెరుగుతున్నాయి. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. అందరినీ ఇబ్బంది పెడుతుంది. థైరాయిడ్ అనేది మన గొంతులో ఉండే గ్రంధి అని, దీని నుంచి శరీరంలో హార్మోన్లు ఉత్పత్తి అవుతాయని మీకు తెలిసే ఉంటుంది. థైరాయిడ్ ఎక్కువగా ఉన్నా లేదంటే చాలా తక్కువగా ఉన్నా సరే ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపిస్తుంది. ఇక ఈ థైరాయిడ్ అనే వ్యాధికి చికిత్స లేదు. అయితే మందులతో పాటు జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల థైరాయిడ్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. థైరాయిడ్‌తో బాధపడుతున్న రోగులు సరైన జీవనశైలి, పోషకాహారం, వ్యాయామం మొదలైనవాటిని ప్రతిరోజూ పాటించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇక ఈ ఆర్టికల్ లో, మీరు మీ థైరాయిడ్‌ను నియంత్రించగలిగే జీవనశైలి మార్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

    పోషకమైన ఆహారం
    థైరాయిడ్‌కు ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఒకప్పుడు సాంప్రదాయ వంటకాలు మాత్రమే తినేవారు. ఇప్పుడు మొత్తం మాడ్రన్ అన్నట్టుగా మారాయి ఆహారపు అలవాట్లు. బేకరీ ఐటమ్స్, డోమినోస్, రెస్టారెంట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు ఈ సమస్య మరింత పెరుగుతుంది. కాబట్టి, థైరాయిడ్‌తో బాధపడేవారు ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన ఆహారం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కడుపు చాలా కాలం సేపు నిండుగా ఉంటుంది. మాటి మాటికి తినాలి అనే కోరిక ఉండదు. అలాగే గట్ ఫ్రెండ్లీ డైట్ తీసుకోవాలి.

    శారీరక శ్రమ
    థైరాయిడ్‌ను నియంత్రించడానికి, రోజువారీ దినచర్యలో శారీరక శ్రమను చేర్చడం చాలా ముఖ్యం. యోగా, వ్యాయామం లేదా నడక ద్వారా థైరాయిడ్ లక్షణాలు తగ్గుతాయి. శారీరక శ్రమ శరీరంలో జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీని వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అందుకే ప్రతి ఒక్కరు మీ లైఫ్ లో శారీరక శ్రమను కచ్చితంగా భాగం చేసుకోవాలి.

    టెన్షన్
    ఒత్తిడి కూడా థైరాయిడ్‌కు కారణం. అధిక ఒత్తిడి కారణంగా జీవక్రియ తగ్గుతుంది. కాబట్టి ఒత్తిడికి దూరంగా ఉండండి. మనశ్శాంతి కోసం, ధ్యానం, యోగా, శ్వాస వ్యాయామాలు చేయండి. వీటి వల్ల మీకు మరింత ఉపశమనం పొందుతుంది. థైరాయిడ్ కు మాత్రమే కాదు మీ శరీరానికి కూల్ ఫీలింగ్ ను అందిస్తుంది యోగా.

    7-8 గంటల నిద్ర
    థైరాయిడ్‌ను నియంత్రించడానికి తగినంత నిద్ర పొందడం కూడా చాలా ముఖ్యం. తక్కువ నిద్ర తీసుకోవడం వల్ల అలసట, శక్తి వస్తుంది. అందువల్ల, మీరు ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల నిద్రను తీసుకోవడం చాలా ముఖ్యం. నిద్ర ఎన్నో సమస్యలకు కారణం అవుతుంది. ఈ నిద్ర తక్కువ ఉంటే చాలా సమస్యలు వస్తాయి. లేదంటే మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అందుకే ఈ విషయంలో జాగ్రత్త పడటం ముఖ్యం అంటున్నారు నిపుణులు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..