Marriage : పెళ్లయిన తర్వాత బెస్ట్ ఫ్రెండ్‌తో ఎలా ప్రవర్తించాలి అనేది చాలా ముఖ్యం. మీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోవడం సంతోషకరమైన సందర్భం మాత్రమే కాదు, మీ సంబంధం స్వభావం మారే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి కాస్త సహనం చాలా అవసరం. వారి వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్య రాకుండా మీరు మెలగాల్సిన సమయం ఇది. ఈ మార్పును సానుకూలంగా స్వీకరించడం చాలా ముఖ్యం. మీ ప్రవర్తనను సరైన దిశలో మార్చడంలో సహాయపడే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. ప్రాధాన్యత:
వివాహం తర్వాత, మీ బెస్ట్ ఫ్రెండ్ ప్రాధాన్యతలు మారవచ్చు. వారు ఇప్పుడు వారి జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం ఇస్తారు. ఈ మార్పును సులభంగా అంగీకరించాలి. అంతే కానీ ప్రతిసారి టార్గెట్ చేసినట్టు మాట్లాడుతూ మీరు మారిపోయారు అంటూ డైలాగ్స్ వేయవద్దు.
2..స్పేస్
వివాహం తర్వాత, ప్రతి వ్యక్తి తన కొత్త సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. వారికి కాస్త సమయం ఇవ్వాలి. స్నేహంలో అవసరమైనంత స్పేస్ ఇవ్వండి. మునుపటిలా మళ్లీ మళ్లీ కలవాలన్నా, మాట్లాడాలన్నా ఆలోచనలు ఉంటే కాస్త పక్కన పెట్టండి. వారి సంసారం కుదుట పడిన తర్వాత మళ్లీ మీకు సమయం ఇస్తారు అని మర్చిపోవద్దు. ఎందుకంటే వారు మీ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి.
3. పెళ్లి తర్వాత ఇద్దరికీ సమాన గౌరవం
మీ సంబంధం మీ స్నేహితుడికి మాత్రమే పరిమితం కాదు. వారి జీవిత భాగస్వామితో కూడా కనెక్ట్ అవుతుంది. వారి జీవిత భాగస్వామితో మంచిగా ఉండండి. వారిని కూడా మీ సమూహంలో భాగంగా చేసుకోవాలి. అవైడ్ చేయవద్దు.
4. వైవాహిక జీవిత గోప్యత
మీ స్నేహితుడి వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోకండి. వారు తమ ఆలోచనలను పంచుకుంటేనే సలహా ఇవ్వండి. అడగకుండానే అభిప్రాయం చెప్పడం వారి బంధంలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
5. బాధ్యతలు..
వైవాహిక జీవితంలో తరచుగా బాధ్యతలు పెరుగుతాయి. దీని వల్ల వారు స్నేహితులతో ఉండే సమయం కాస్త తగ్గుతుందనే చెప్పాలి. కొన్నిసార్లు వారిని వారి భాగస్వాములను ఆశ్చర్యపరచడం ద్వారా పాత రోజులను గుర్తుంచుకోండి.
6. మద్దతు
మీ స్నేహితుడికి ఎప్పుడైనా మీ అవసరం వస్తే ఆ సమస్యలలో వారికి మద్దతు ఇవ్వండి. వారి సమస్యలను విని సరైన సలహాలు ఇవ్వండి. ఇది పెళ్లి తర్వాత కూడా మీ బంధాన్ని బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.
మొత్తం మీద వివాహం తర్వాత స్నేహాం రూపం కాస్త మారుతుంది అనేది వాస్తవం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే?. మీ రిలేషన్ మాత్రం అసలు ఎండ్ కాదు. ఎందుకంటే మీది ట్రూ ఫ్రెండ్షిప్ కదా. సరైన ప్రవర్తన, అవగాహనతో, మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ వైవాహిక జీవితానికి ఆనందాన్ని కూడా యాడ్ చేయవచ్చు. ఇలాంటివి వారి కొత్త రిలేషన్ లో మీ స్నేహాన్ని బలపరచడంలో కూడా సహాయం చేస్తుంది.