Laptop Heating: గడిచిన మూడు సంవత్సరాల నుంచి ల్యాప్ టాప్స్ వినియోగం ఊహించని స్థాయిలో పెరిగిందనే సంగతి తెలిసిందే. ఆఫీస్ వర్క్ కు, ఆన్ లైన్ క్లాసులకు ల్యాప్ టాప్స్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే ఎక్కువ సమయం ల్యాప్ టాప్స్ ను వినియోగిస్తే అవి వేడెక్కుతాయి. ల్యాప్ టాప్స్ వేడెక్కడం వల్ల కొన్నిసార్లు ల్యాప్ టాప్స్ కాలిపొయే అవకాశాలు ఉంటాయి. కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు.
ల్యాప్ ట్యాప్ లో ఉండే కూలింగ్ ఫ్యాన్లు ల్యాప్ టాప్ వేడెక్కకుండా చేయడంలో తోడ్పడతాయి. ల్యాప్ ట్యాప్ లో ఉండే కూలింగ్ ఫ్యాన్లు వేడిని తగ్గించడంలో ఉపయోగపడతాయి. ల్యాప్ టాప్ పనితీరు నెమ్మదిగా ఉన్నా ల్యాప్ టాప్ కూలింగ్ ఫ్యాన్లు ఎక్కువగా తిరుగుతున్నా ల్యాప్ టాప్ వేడెక్కుతోందని గుర్తుంచుకోవాలి. ఇతర కాలాలతో పోలిస్తే వేసవికాలంలో ల్యాప్ టాప్ వేడెక్కే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి.
హెచ్.డబ్ల్యూ మానిటర్ అనే టూల్ ను వినియోగించడం ద్వారా ల్యాప్ టాప్ లో ఏయే పార్ట్ లు ఎంత వేడి అవుతున్నాయో తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ల్యాప్ టాప్ వేడెక్కుతుందని అనిపిస్తే మొదట కూలింగ్ ఫ్యాన్ ను శుభ్రం చేయాలి. వాక్యూమ్ క్లీనర్ లేదా ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ సహాయంతో ల్యాప్ టాప్ ను సులభంగా శుభ్రం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది.
తక్కువ ప్రెజర్ ఉండే ఎయిర్ పంప్ సహాయంతో కూడా ల్యాప్ టాప్ లను శుభ్రం చేసే అవకాశం అయితే ఉంటుంది. వీలైతే ల్యాప్ టాప్ లకు విడిగా కూలింగ్ పాడ్ ను అమర్చాలి. కూలింగ్ పాడ్ లను వినియోగించడం వల్ల ల్యాప్ టాప్ లో ఎయిర్ ఫ్లో సులభంగా జరిగే అవకాశం అయితే ఉంటుంది.