spot_img
Homeలైఫ్ స్టైల్Siblings : తోబుట్టువుల మధ్య సఖ్యత ఉండటం లేదా? అయితే ఇవి పాటించండి

Siblings : తోబుట్టువుల మధ్య సఖ్యత ఉండటం లేదా? అయితే ఇవి పాటించండి

Siblings : బంధాలకు, బంధుత్వాలకు మనదేశంలో ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అయితే మనదేశంలో ప్రస్తుతం చాలామంది చిన్నతనం నుంచే బంధాలను పక్కన పెట్టేస్తున్నారు. అన్ని బంధాల కన్నా తోబుట్టువుల మధ్య బంధం వీడదీయరానిది. తోబుట్టువుల మధ్య బంధం ఎలా ఉంటుంది అనే దానికి గోరింటాకు, అర్జున్, బ్రదర్స్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు వంటి సినిమాల్లో కూడా మనం చూసే ఉంటాం. కానీ ఈమధ్య చాలామంది తోబుట్టువులు చిన్నవిషయాలకే గొడవలు పడుతూ ఒకరిమీద ఒకరు కోపంగా ఉంటున్నారు. చిన్నప్పటి నుంచే గొడవలు పడుతున్నారు. అసలు బంధాలు విలువ తెలియక విడిపోతున్నారు. తల్లిదండ్రులు వాళ్లని ఎంత సఖ్యతగా ఉండమని చెప్పినా వినే పొజిషన్‌లో కూడా పిల్లలు ఉండట్లేదు. మరికొందరైతే మరీ దారుణం.. చిన్న విషయానికి కూడా తోబుట్టువుతో గొడవులు పడుతూ చిన్నప్పటి నుంచే కోపాన్ని పెంచుకుంటారు. తోబుట్టువులు ఇలా గొడవులు పడటానికి తల్లిదండ్రులు ముఖ్య కారణమా? లేకపోతే ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? అనే విషయాలు తెలుసుకుందాం.

సాధారణంగా కొందరి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు నుంచి ముగ్గురు పిల్లలు ఉంటారు. అయితే అందరూ పిల్లలు ఒకేలా ఉండరు కదా. కొందరు సైలెంట్‌గా ఉంటే మరికొందరు అల్లరి చేస్తుంటారు. దీంతో కొందరు తల్లిదండ్రులు అన్నయ్యను చూసి నేర్చుకో, లేదా తమ్ముడిని చూసి నేర్చుకో అని ఇలా పిల్లలను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. దీంతో కొందరు పిల్లలు తనతో నన్ను పోల్చడం ఏంటని.. తోబుట్టువుతో సరిగ్గా ఉండరు. వాళ్ల మీద చిన్న ఈర్ష్యలా వచ్చి ప్రతి చిన్న విషయాలకి వివాదాలకి తోవ తీస్తారు. దీనివల్ల ఇద్దరి మధ్య గోడవలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. పిల్లలు ఎందులోనైనా వెనుకబడితే వాళ్లని వేరే వాళ్లతో పోల్చకూడదు. ప్రతి చిన్న విషయాన్ని వాళ్లకు అర్థం అయ్యేటట్లు చెప్పాలి. ఏ విషయం అయినా తెలియకపోతే తోబుట్టువును అడిగి తెలుసుకో అని తల్లిదండ్రులే పిల్లలకు అర్థం అయ్యే విధంగా చెప్పాలి. లేకపోతే వారి మధ్య మనస్పర్థాలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కొందరు తోబుట్టువులు గొడవలను మనసులో పెట్టుకుంటారు. మరికొందరైతే గొడవలు పడినా మళ్లీ కలిసిపోతారు. ఇలా చేయడం వల్ల తోబుట్టువులు మధ్య బంధం మరింత బలపడుతుంది. అలాగే రోజులో ఎక్కువ సమయం తోబుట్టువులతో గడపమని చెప్పండి. చిన్న విషయాలకి గొడవలు పడవద్దని చెప్పండి. అలాగే పిల్లలను తోబుట్టువుల ముందు శిక్షించకపోవడం మంచిది. తోబుట్టువుల ముందు శిక్షించడం వల్ల వాళ్లు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇది కాస్త వాళ్ల మధ్య గొడవులను దారితీయవచ్చు. కాబట్టి అందరి పిల్లలను ఒకేలా చూడకండి. ఉదాహరణకు ఇద్దరు తోబుట్టువులను తీసుకున్నాం అనుకోండి. ఇద్దరికీ అన్ని తెలియాలని లేదు కదా. కాబట్టి తెలియని విషయాలను తెలిసిన తోబుట్టువు నుంచి నేర్చుకోమని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. ఇలా చేస్తే తోబుట్టువుల మధ్య రోజురోజుకి అన్యోన్యత పెరిగే అవకాశం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website
RELATED ARTICLES

Most Popular