Cats Astrology: మనం ఎన్నో రకాల జంతువులను పెంచుకుంటాం. కుక్క, పిల్లి, మేక, కోళ్లు పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇందులో పిల్లిని మాత్రం అశుభానికి సూచకంగా చెబుతారు. ఏదైనా ప్రయాణం చేయాలంటే పిల్లి ఎదురుగా వస్తే ఇక అంతే సంగతి ఆ పని కానే ఉద్దేశం ప్రజల్లో ఉండిపోయింది. దీంతో పిల్లి ఎదురుపడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ ఎదురైతే ఆ పని కాదనే చెబుతుంటారు. పిల్లిని అశుభానికి సంకేతంగా భావిస్తారు. ఎలుకలను సంహరించేందుకే పిల్లిని పెంచుకుంటారు. కానీ అది ఇంటిలో చేసే ఆగంతో అందరికి కోపమే వస్తుంది. ఎక్కడపడితే అక్కడ మూత్ర, మలవిసర్జన చేసి విసుగు తెప్పిస్తుంది.

కొన్ని దేశాల్లో పిల్లిని ఆరాధిస్తారు. దానికి ప్రత్యేకంగా గుడి కూడా కట్టించారు. కానీ మన దేశంలో మాత్రం పిల్లిని హీనంగా చూస్తారు. అది ఎదురుపడితే కాసేపు ఆగి మరీ వెళతారు. పిల్లిని మనం ఎందుకు అశుభానికి సంకేతంగా భావిస్తామంటే దానిలో కొన్ని మైనస్ లు ఉన్నాయి. పిల్లి యజమాని ఉన్నతిని కోరుకోదు. ఇళ్లంతా అశుభ్రం చేస్తుంది. కుక్కను పెంచితే అది విశ్వాసం చూపిస్తుంది. ఎవరైనా దొంగలు వస్తే తన నోరు ద్వారా చెబుతుంది. కానీ పిల్లి అలా కాదు. అది ఇంట్లో ఉంటే అన్ని ఇబ్బందులు తెస్తుంది.
Also Read: Chiranjeevi Politics: చిరు వద్దంటున్నా లాగే ప్రయత్నం చేస్తున్నారే..
పిల్లిని దరిద్రదేవతగా గుర్తిస్తారు. సంపదకు చిహ్నం లక్ష్మిదేవి. దరిద్రదేవతకు చిహ్నంగా పిల్లిని పిలుస్తుంటారు. అందుకే పిల్లి ఎదురు పడితే ఆ ప్రయాణం వాయిదా వేసుకుంటారు. అవసరమైతే తరువాత వెళతారు కానీ పిల్లి తారసపడితే ఆ ప్రయాణం రద్దు చేసుకోవడం కొత్తేమీ కాదు. భారతీయులు దురదృష్టానికి సంకేతంగా పిల్లిని భావిస్తారు. పిల్లి ఎదురైనా పట్టించుకోకుండా వెళితే ఆ పని కాదనే అనుమానం వస్తుంది. దీంతో పిల్లి కనబడితే చిరాకే కలుగుతుంది. అందుకే పిల్లిని మన వారు అశుభానికి సంకేతంగా పరిగణించడం తెలిసిందే.

మనది వ్యవసాయ ఆధార దేశం కావడంతో అందరి ఇళ్లల్లో ధాన్యం నిల్వలు ఉండటంతో ఎలుకలు వస్తాయి. వాటిని నియంత్రించే క్రమంలో పిల్లులను పెంచుకోవడం పరిపాటే. పిల్లి మీద ఉన్న వెంట్రుకలతో అనారోగ్యాలకు ఆస్కారం ఉంటుంది. వాటిపై ఉండే వెంట్రుకలతో రోగాలు వస్తాయని చెబుతుంటారు. భారతీయ సనాతన ధర్మంలో పిల్లిని అశుభ సూచకంగా భావిస్తారు. పిల్లి ఎదురుపడితే పని కాదనే విశ్వాసం పెరిగింది. ఏదో ఒక చెడు జరుగుతుందని నమ్ముతారు. ఎలా చూసినా పిల్లిని అశుభానికి చిహ్నంగానే అనుకోవడం మామూలే.
Also Read:Chalaki Chanti Elimination: షాక్… చలాకీ చంటిని బయటకు పంపడానికి అంత కుట్ర జరిగిందా!