Keerthy Suresh: ట్రెండ్ కి తగ్గట్లుగా ఎవరైనా మారాల్సిందే. సినిమా తారలకు ఇది ఇంకా ఇంపార్టెంట్. అప్డేటెడ్ గా ఉండిపోతే పక్కన పెట్టేస్తారు. ఈ విషయాన్ని కీర్తి సురేష్ బాగా ఒంటబట్టించుకున్నారు. మెల్లమెల్లగా తనలోని గ్లామర్ కోణం పరిచయం చేస్తున్నారు. హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ నుండి గ్లామరస్ హీరోయిన్ కి షిఫ్ట్ అవుతున్నారు. ఈ మధ్య ఆమె ఎంచుకుంటున్న పాత్రలు, సోషల్ మీడియా పోస్ట్స్ దీనికి నిదర్శనం. కీర్తి ఇంస్టాగ్రామ్ లో స్కిన్ షోకి తెరలేపింది. ట్రెండీ వేర్స్ ధరించి అందాల ప్రదర్శన చేస్తుంది. కీర్తి గ్లామర్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ అవుతుంది.

కీర్తి సురేష్ లోని ఈ గ్లామర్ కోణం మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా హాట్ బాడీ కాన్ డ్రెస్ లో బోల్డ్ ఫోజులతో రచ్చ చేసింది. ఇక కీర్తి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరో వైపు కీర్తి సక్సెస్ ఫుల్ కెరీర్ లీడ్ చేస్తుంది. ఆమె లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మహేష్ తో కీర్తి తొలిసారిగా జతకట్టారు. ఈ మూవీలో కీర్తి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం విశేషం. మహేష్ తో కీర్తి కెమిస్ట్రీ బాగానే కుదిరింది.

ప్రస్తుతం తెలుగులో నానికి జంటగా దసరా మూవీలో నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. హీరో నాని కెరీర్ లో మొదటిసారి పూర్తి స్థాయి డీగ్లామర్ రోల్ చేస్తున్నారు. కోల్ మైన్స్ వర్కర్ గా పెరిగిన జుట్టు, లుంగీలో ఊరమాస్ గెటప్ లో దర్శనమిస్తున్నాడు. ఈ మూవీలో కీర్తి లుక్ ఇంకా రివీల్ కాలేదు. దీంతో ఆమె ఎలాంటి పాత్ర చేస్తున్నారనే ఆసక్తి నెలకొంది.

అలాగే చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీలో కీర్తి నటిస్తున్నారు. ఈ మూవీలో ఆమె చిరంజీవి చెల్లిగా చేయడం విశేషం. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తున్న కీర్తి సురేష్ చెల్లి పాత్రలు చేయడం నిజంగా గొప్ప విషయం. పెద్దన్న సినిమాలో రజినీకాంత్ చెల్లిగా కూడా ఆమె చేశారు.

ఆ మధ్య కీర్తి వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేశారు. మహానటి మూవీ ఆమె ఇమేజ్ పూర్తిగా మార్చేసిన క్రమంలో లేడీ ఓరియెంటెడ్ ఆఫర్స్ వచ్చాయి. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి చిత్రాల్లో కీర్తి నటించారు. అయితే అనుకున్న స్థాయిలో ఆడలేదు. అమెజాన్ లో ప్రైమ్ లో విడుదలైన చిన్నా చిత్రం మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. గతంతో పోల్చితే కీర్తికి ఆఫర్స్ తగ్గాయి. దసరా మూవీతో ఆమె కమ్ బ్యాక్ అవుతుందేమో చూడాలి.