Gmail Storage: కమ్యూనికేషన్ వ్యవస్థలో Gmail చాలా కీలకంగా పనిచేస్తుంది. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా జీమెయిల్ యూజర్స్ తగ్గడం లేదు. కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ తో పాటు భారీ సైజులో ఉన్న ఫొటోస్, వీడియోలు పంపించుకోవాలంటే gmail Account ఉండాల్సిందే. అలాగే కొత్తగా ఉద్యోగం చేరాలనుకునేవారు తమ రెస్యూమ్ లో జీమెయిల్ ను తప్పనిసరిగా ఉండాలని కొన్ని కంపెనీలు సూచిస్తుంటాయి. పలు అవసరాలకు, కంపెనీలకు జీమెయిల్ అకౌంట్ ఇస్తుంటాం. దీంతో దీనికి చాలా రకాల మెయిల్స్ వస్తుంటాయి. ఈ క్రమంలో స్టోరేజ్ ఫుల్ అయిపోతూ ఉంటుంది. ఒక అకౌంట్ లో 15 జీబీ వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ తరువాత మెయిల్స రావాలంటే ఉన్న ఫైళ్లలో అన్ ఇంపార్టెంట్ వి తీసుసుకోవాలి. కానీ అన్నీ ప్రధానంగా ఉండి తీసేయని పరిస్థితి ఉంటే? ఈ సమయంలో స్టోరేజ్ తగ్గాలంటే ఈ చిన్న ట్రిక్ ఫాలో కండి..
ఉద్యోగులకు జీమెయిల్ తప్పనిసరిగి. కంపెనలు, సంస్థతో వ్యవహారాలు జరపాలంటే జీమెయిల్ అకౌంట్ ఉండాలి. అయితే ఉద్యోగంతో పాటు ఇతర అవసరాలకు జీమెయిల్ అకౌంట్ ఇవ్వడం వల్ల వివిధ రకాల మెయిల్స్ వస్తుంటాయి. వీటితో పాటు ఫోన్ లోని కొన్ని ఫోటోస్ ను గూగుల్ డ్రైవ్ లో స్టోర్ చేసుకుంటారు. ఇలా ఫొటోస్ సైజ్ ఎంబీల్లోనే ఉంటుంది. ఇవి ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా జీమెయిల్ స్టోరేజ్ నిండిపోతుంది. ఇలాంటి సమయంలో ఫోటోస్ ను తీసేయలేం. కానీ వీటి సైజ్ తగ్గించడం వల్లో స్పేస్ దొరుకుతుంది. అయితే గూగుల్ డ్రైవ్ లో ఉన్న ఫొటోల సైజ్ తగ్గించాలంటే ఇలా చేయాలి.
ముందుగా గూగుల్ లోకి వెల్లి Photos.google.com అని టైప్ చేయాలి. ఇప్పుడు డిస్ ప్లే అయిన మొదటి వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆ తరువాత ఎడమ వైపు పైన ఉన్న 3 బార్స్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక టేబుల్ ఓపెన్ అవుతుంది. ఇందులో కిందికి స్క్రోల్ చేయగా.. storage అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయగానే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దానిని కిందికి స్క్రోల్ చేయాలి. ఇప్పుడు Recovr storage అనే ఆప్షన్ కనిపిస్తుంి. అయితే దాని కింద ఉన్న Learnmore ను ప్రెస్ చేయగా మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కింద ఉన్న బాక్స్ లో టిక్ చేయాలి. ఆ తరువాత compress existing photos & videos అనే ఆప్షన్ పై ప్రెస్ చేయాలి. ఇప్పుడు గూగుల్ డ్రైవ్ లో ఉన్న ఫోటోస్, వీడియోస్ సైజ్ తగ్గిపోతుంటాయి.
చాలా మంది మెయిల్ స్టోరేజ్ ఎక్కువ కాగానే అందులో ఉన్న ఫోటోస్ లేదా వీడియోస్ డెలీట్ చేస్తుంటారు. అయితే వాటిని డెలీట్ చేయకుండా సైజ్ తగ్గించుకోవడం వల్ల మరింత స్పేస్ దొరికి కొత్త మెయిల్స్ రావడానికి అనుకూలంగా ఉంటుంది. రెగ్యులర్ గా జీమెయిల్ యూజ్ చేసేవారికి, ఉద్యోగాలు చేరసేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది.