Curd vs Buttermilk: మనలో చాలా మందికి పాలు, పెరుగు, మజ్జిగ అలవాటు ఉంటుంది. దీంతో మన ఆహారంలో వాటిని భాగంగా చేసుకోవడం సహజమే. పాలు, పెరుగు, మజ్జిగల్లో ఏది మంచిది అనే దానిపై ఆయుర్వేదంలో చెబుతారు. వేసవి కాలంలో మజ్జిగ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఈ మూడింటిలో మనకు అత్యంత అనుకూలంగా ఉండే మజ్జిగతో ఎన్నో లాభాలుంటాయి. పెరుగులో కూడా మంచి బ్యాక్టీరియా ఉండటం వల్ల పొట్టలోని వేడి ఆమ్లాల కారణంగా పులియబెడుతుంది. దీంతో కడుపులోని పేగులు వేడెక్కుతాయి. పెరుగు నుంచి వచ్చే మజ్జిగ శరీరాన్ని చల్లబరుస్తుంది.

మజ్జిగ అన్ని కాలాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగు కొవ్వు, బలాన్ని పెంచుతాయి. వాత అసమతుల్యత కారనంగా పెరుగును ఎక్కువగా తినలేరు. రాత్రిపూట పెరుగును ముట్టుకోవద్దని ఆయుర్వేదం చెబుతోంది. ఊబకాయం, కఫం, రక్తస్రావం, వాపు, రుమటాయిడ్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు ఉన్న వారు పెరుగుకు దూరంగా ఉండటమే మంచిది. రాత్రిపూట పెరుగు తింటే దగ్గు, జలుబు, సైనస్ వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. తప్పని పరిస్థితుల్లో పెరుగు తినాల్సి వస్తే చిటికెడు మెంతులు లేదా మిరియాలు వేసుకుని తినడం సురక్షితం.
పెరుగును వేడి చేయడం వల్ల అందులో ఉండే మంచి బ్యాక్టీరియా నాశనం అవుతుంది. దీంతో చర్మ రుగ్మతలు, పిత్త అసమతుల్యత, తలనొప్పి, నిద్రలేమి, జీర్ణ సమస్యలు వస్తాయి. పెరుగుకు బదులు మజ్జిగ తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. వాపు, జీర్ణసమస్యలు, జీర్ణకోశ సమస్యలు, ఆకలి లేకపోవడం, రక్తహీనత వంటి సమస్యలను నివారించడంలో మజ్జిగ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే ఎక్కువ మంది మజ్జిగ తాగడానికే ప్రాధాన్యం ఇస్తుంటారు. మజ్జిగ తేలికగా ఉండటం వల్ల జీర్ణం కావడం జరుగుతుంది.

మలబద్ధకం, గ్యాస్ట్రిక్ లేదా యాసి్ రిప్లెక్స్ వంటి జీర్ణ సమస్యలు ఉంటే మజ్జిగ మంచిగా పనిచేస్తుంది. అధిక బరువును తగ్గించడంలో సాయపడుతుంది. బరువు పెరగాలనుకుంటే పెరుగు, తగ్గాలనుకునే వారు మజ్జిగ తీసుకుంటే ఫలితం ఉంటుంది. మజ్జిగ తేలికగా ఉండటంతో శరీరానికి చల్లదనం చేస్తుంది. వేడికి దూరంగా ఉంచుతుంది. మజ్జిగ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో మన సొంతం అవుతాయి. దీంతో మజ్జిగను రోజు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.