Rakhi Sawant: బాలీవుడ్ ఐటమ్ బాంబ్ రాఖీ సావంత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటారు. తాజాగా ఆమె భర్త ఆదిల్ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆదిల్ కి ఒక అమ్మాయితో ఎఫైర్ ఉందంటూ పబ్లిక్ లో దారుణ ఆరోపణలు చేసింది. బాలీవుడ్ మీడియాతో ఆమె సంచలన కామెంట్స్ చేశారు. ఓ జిమ్ నుండి బయటకు వస్తున్న రాఖీ సావంత్ వద్దకు మీడియా ప్రతినిధులు వెళ్లి… భర్త ఆదిల్ ఖాన్ తో గొడవేంటని ప్రశ్నించారు. వెంటనే ఆమె బరస్ట్ అయ్యారు. ఆదిల్ ఒక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఆమెను వదిలేస్తానని నాకు ప్రామిస్ చేసి, బ్రేక్ చేశాడన్నారు.

రాఖీ సావంత్ మాట్లాడుతూ… ఆదిల్ ఖాన్ పెద్ద అబద్దాల కోరు. ఒక అమ్మాయితో ఎఫైర్ నడుపుతున్నాడు. నాకు తెలిసి నిలదీశాను. తన నెంబర్ బ్లాక్ చేస్తున్నాను. ఇకపై ఆమెను కలవమని ఖురాన్ మీద ఒట్టేసి చెప్పాడు. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఆమెతో ఎఫైర్ సాగిస్తున్నాడు. ఆ అమ్మాయి ఆదిల్ ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఆమె వద్ద ఆదిల్ చండాలమైన వీడియోలు, ఆడియోలు ఉన్నాయి. అవి బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేస్తుంది.
దయచేసి ఆదిల్ ని మీడియా వాళ్ళు ఇంటర్వ్యూలు చేయవద్దు. నేను మీ కాళ్లుపట్టుకొని వేసుకుంటాను. ఎందుకంటే మీడియాలో కనిపించి హీరో అవ్వాలని తను కోరుకుంటున్నాడు. నేను కూడా ఇకపై అతని గురించి మాట్లాడను. ఆదిల్ జిమ్ కి వచ్చేది వ్యాయామం చేయడానికి కాదు. మీడియా వాళ్ళు ఉంటారనే. కాబట్టి అదిల్ ని మీరు పట్టించుకోకండి. అతన్ని ఇంటర్వ్యూ చేయకండి… అంటూ ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

నటుడు ఆదిల్ ఖాన్ ని 2022లో రాఖీ సావంత్ వివాహం చేసుకుంది. కనీసం ఏడాది గడవకుండానే అతనితో మనస్పర్థలు ఏర్పడ్డాయి. అతడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడంటూ ఆమె ఆరోపిస్తున్నారు. 44 ఏళ్ల ఈ నటి 2019లో రితేష్ సింగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. విడాకులు తీసుకున్న రాఖీ సావంత్ ఆదిల్ ఖాన్ ని రెండో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల రాఖీ సావంత్ తల్లిగారు జయ మరణించారు. ఆమె క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. తల్లి మరణించి రెండు వారాలు కూడా ముగియలేదు. రాఖీ సంచలన వ్యాఖ్యలతో వార్తలకు ఎక్కారు.