IPL Auction 2023- Nicholas Pooran: ఆటగాళ్లను సరైన విధంగా వాడుకోవడంలో ముంబై, చెన్నై టీంలు ఆదర్శమని చెప్పొచ్చు. అందులోకి సాధారణ క్రీడాకారులు చేరినా వారిని మెరికల్లాగా తయారు చేస్తారు. ముంబై నుంచి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లు ఎలా ఎదిగారో చూశాం. ఇక చెన్నై నుంచి జడేజా, రుత్ రాజ్, దీపక్ చాహర్ లు ఇలాగే అంతర్జాతీయ ఆటగాళ్లుగా ఎదిగారు.

కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ కు మాత్రం పూర్తి భిన్నమైన కథ. ఇక్కడికి అంతర్జాతీయంగా తోపులైన క్రికెటర్లు వచ్చినా వీరి రాజకీయాలతో ఉన్న ఆట ఆడడం మరిచిపోయి ఫ్లాప్ అవుతున్నారు. అంతకుముందు డేవిడ్ వార్నర్ ను ఇలాగే ఆడడం లేదని కెప్టెన్సీ నుంచి తొలగించారు. ఆ తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలయమ్స్ సన్ కు ఇదే గతి పట్టించారు. ఇక ఇటీవల లాస్ట్ సీజన్ ఆడిన వెస్టిండీస్ టీం కెప్టెన్ నికోలస్ పూరన్ కూడా మేటి క్రీడాకారుడే. గత సీజన్ లో ఆడలేదని.. అతడిపై విశ్వాసం ఉంచకుండా వదిలేశారు.
కానీ నవ్విన నాపచేనే పండినట్టు హైదరాబాద్ వదిలేసిన నికోలస్ పూరన్ కు పంట పండింది. ఏకంగా ఐపీఎల్ వేలంలోనే మోస్ట్ అత్యధిక ధర పలికిన వికెట్ కీపర్ గా పూరన్ నిలిచాడు.

నికోలస్ పూరన్ కోసం తొలుత రాజస్థాన్, చెన్నై బరిలోకి దిగగా.. మధ్యలో ఢిల్లీ వచ్చి చేరింది. దీంతో చెన్నై విరమించుకుంది. రాజస్తాన్, ఢిల్లీ మధ్య దాదాపు రూ.8 కోట్ల వరకూ వెళ్లింది. మధ్యలో లక్నో రేసులోకి వచ్చి రూ.12 కోట్లకు పాడింది. చివరకు లక్నో రూ.16 కోట్లకు పూరన్ ను చేజిక్కించుకుంది.
ఇలా హైదరాబాద్ కాదని వదిలేసిన నికోలాస్ పూరన్ ఐపీఎల్ లోనే మోస్ట్ ఎక్స్ పెన్సిసివ్ వికెట్ కీపర్ గా నిలిచాడు. అతడి పై ఏకంగా 16 కోట్లు కుమ్మరించి మరీ లక్నో తీసుకోవడం సన్ రైజర్స్ కు గట్టి షాక్ అనే చెప్పొచ్చు. ఇలానే మేటి ప్లేయర్లను వదులుకొని అనామకుల కోసం కోట్లు తగలేసి సన్ రైజర్స్ చేతులు కాల్చుకుంటోంది.