KGF- Kaikala Satyanarayana: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో మహానటుడుని కోల్పోయింది..తెలుగు సినీ స్వర్ణ యుగం లో మిగిలిన ఏకైక తార నేడు నేలకొరిగింది..విలన్ గా,హీరో గా , క్యారక్టర్ ఆర్టిస్టు గా, కమెడియన్ గా ఇలా ఒక్కటా రెండా, ఆయన పోషించని పాత్ర అంటూ ఏది మిగిలి లేదు..అలాంటి మహానటుడు కైకాల సత్యనారాయణ నేడు ఉదయం నాలుగు గంటల సమయం లో కన్నుమూశారు..కొంతకాలం నుండి అనారోగ్యం తో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ, తన స్వగృహం లోనే చికిత్స చేయించుకుంటూ ఉండేవాడు..ఆయనని చివరిసారిగా ఇండస్ట్రీ నుండి మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కలిసాడు.

సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛము అందించాడు..వెంటిలేటర్ మీదున్న సత్యనారాయణ చిరంజీవి ని చూసి ఎంత సంతోషించాడో మనం ఆ వీడియో లో చూసాము..ఇప్పటికి ఆ వీడియో సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది..అదే ఆయన చివరిసారిగా మీడియా ముందుకి కనపడడం..2019 లో విడుదలైన మహర్షి సినిమా తర్వాత ఆయన నటనకి గుడ్ బై చెప్పేసాడు.
కైకాల సత్యనారాయణ కి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు..అయితే ఆయన నట వారసత్వాన్ని ముందుకు కొనసాగించేందుకు తన కొడుకులను ఇండస్ట్రీ కి ఎందుకు తీసుకొని రాలేదు అనే సందేహం ప్రతీ ఒక్కరిలో ఉండేది..కానీ వాళ్ళిద్దరికీ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి లేకపోవడం వల్లే ఇండస్ట్రీ కి రాలేదు..వ్యాపార రంగం లో గొప్పగా రాణిస్తున్నారని, కైకాల సత్యనారాయణ ఒక ఇంటర్వ్యూ లో అప్పట్లో తెలిపాడు..కానీ పెద్ద కుమారుడు కైకాల లక్ష్మి నారాయణ మాత్రం సినీ రంగం లోకి ఈమధ్యనే అడుగుపెట్టాడు.

కన్నడలో సంచలన విజయం సాధించిన KGF సిరీస్ కి లక్ష్మి నారాయణ సహా నిర్మాతగా వ్యవహరించాడు..తెలుగు లో రెండు భాగాలను ఆయనే స్వయంగా విడుదల చేసాడు..రెండూ కూడా సంచలన విజయం సాధించాయి..వంద కోట్ల రూపాయలలో లాభాలు కూడా వచ్చాయి..ఈ సినిమా టైటిల్స్ పడేముందు ‘కైకాల సత్యనారాయణ సమర్పించు’ అని పడడం మనం గమనించే ఉంటాము..ఈ సినిమా ద్వారా సుమారుగా 170 కోట్ల లాభాలు సత్యనారాయణ కుమారుడికి వచ్చినట్టు తెలుస్తుంది.