Pawan Kalyan- Balakrishna Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో ప్రస్తుతం ఎవ్వరు ఊహించని పీక్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు..అఖండ సినిమాతో ప్రారంభమైన బాలయ్య జైత్ర యాత్ర ఆహా మీడియా లో ప్రసారమయ్యే ‘అన్ స్టాపబుల్’ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించి యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించాడు..ప్రస్తుతం ఆయన హీరో గా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ‘వీర సింహా రెడ్డి’ చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

జనవరి 12 వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సాంగ్ షూటింగ్ ని జరుపుకుంటుంది..అయితే ఈరోజు బాలయ్య బాబు కి మరియు మూవీ యూనిట్ కి సర్ప్రైజ్ ఇస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వీర సింహ రెడ్డి’ షూటింగ్ స్పాట్ లో తళుక్కుమని మెరిశాడు..దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
బాలయ్య బాబు ని మర్యాదపూర్వకంగా కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకునట్టు తెలుస్తుంది..అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ‘అన్ స్టాపబుల్’ షో కి ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్న విషయం కూడా అందరికీ తెలిసిందే..ఈ నెల 27 వ తారీఖున ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ జరగబోతుంది..పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు డైరెక్టర్ క్రిష్ కూడా ఈ షో లో పాల్గొనబోతున్నారు.

మరో మూడు రోజుల్లో షూటింగ్ పెట్టుకొని, ముందే బాలయ్య బాబు ని పవన్ కళ్యాణ్ ఎందుకు కలిసినట్టు..?, అంటే షో లో ఎలాంటి ప్రశ్నలు అడగాలి అనే దానిపై పవన్ కళ్యాణ్ ముందస్తుగా బాలయ్య బాబు ని కలవడానికి వచ్చాడా..?, లేదా నేను షో కి రాలేకపోతున్నాను దయచేసి ఏమి అనుకోకండి అని చెప్పడానికి కలిశాడా..?, లేదా మామూలుగానే సరదాగా కాసేపు చిట్ చాట్ చెయ్యడానికి కలిశాడా అనేది తెలియాల్సి ఉంది..’హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో నిన్నటి నుండి జరుగుతుంది..అదే లొకేషన్ లో బాలయ్య బాబు షూటింగ్ కూడా జరుగుతుంది..అందుకే ఫార్మాలిటీ గా కలిసాడని మరికొంతమంది చెప్పుకుంటున్నారు.