IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐపీఎల్ లో ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ధోనీ సారథ్యంలో టాప్ టీమ్ గా వెలుగొందింది. అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న టీమ్ కూడా చెన్నైనే. అందుకే ఈ సారి కూడా టైటిల్ ఫేవరెట్ గా రంగంలోకి దిగింది. కానీ అనుకున్న స్థాయిలో మాత్రం రాణించలేకపోతోంది. అత్యంత దారుణమైన ఆటను కనబరుస్తోంది.

ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ లను దారుణంగా ఓడిపోయిన చెన్నై.. ముచ్చటగా మూడో మ్యాచ్ లో కూడా ఓడిపోయింది. కోల్‌కతా, లక్నో సూపర్ జెయింట్స్ మీద ఇప్పటికే ఓడిపోయింది. ఇక నిన్న రాత్రి పంజాబ్ కింగ్స్ చేతుల్లో దారుణంగా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 181 రన్స్ చేసి భారీ లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచింది.
Also Read: Bigg Boss Telugu OTT: స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్.. అతని మీద సిరీయస్..
లియామ్ లివింగ్‌స్టోన్ అద్భుతంగా ఆడాడు. 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో సునామీ సృష్టించి 60 రన్స్ చేశాడు. అతనికి తోడుగా శిఖర్ ధవన్ 33, జితేష్ శర్మ-26 అండగా నిలిచారు. ఫలితంగా 180 పరుగులు వచ్చాయి. ఇక చెన్నై బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. ఏ క్రమంలో కూడా పోరాడలేదు.
కేవలం 36 పరుగులకే వద్దే సగం మంది బ్యాట్స్ మెన్స్ ఐట్ అయిపోయారు. రాబిన్ ఉతప్ప 13, రుతురాజ్ గైక్వాడ్ 1, మొయిన్ అలీ 0, అంబటి రాయుడు 13, రవీంద్ర జడేజా 0 అత్యంత దారుణంగా విఫలమయ్యారు. ఏ కొంచెం కూడా ఆట చూపించలేకపోయారు. అయితే ఈ క్రమంలో గ్రౌండ్ లోకి వచ్చిన శివందూబే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ధోనీ 23 పరుగులతో పర్వాలేదని పించాడు. దీంతో 18 ఓవర్లల్లో 126 పరుగులకు ఆల్ ఔట్ అయిపోయింది.

ఇక కెప్టెన్ గానే కాకుండా ఆటగాడిగా కూడామమరోసారి ఫెయిల్ అయ్యాడు రవీంద్ర జడేజా. ఈ మ్యాచ్ లో బౌలర్లు దారుణంగా పరుగులు ఇచ్చేశారు. బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ మరోసారి ఘోరంగా విఫలమయింది. అందుకే ఈ మ్యాచ్ లో అత్యంత దారుణంగా ఓడిపోయింది. ముఖ్యంగా బౌలర్ ముఖేష్ చౌధరి ఈ మ్యాచ్ లో కూడా దారాలంగా పరుగులు ఇచ్చేశాడు. ఇవన్నీ కూడా జట్టు ఓటమికి పెద్ద కారణమయ్యాయి.
Also Read:AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల కలెక్టరేట్లు ఇవే.. ఏ జిల్లా ఆఫీస్ ఎక్కడంటే?
[…] Online Ticket Portal Tender Issue: మెగా ఫ్యామిలీ అంటే.. పరిశ్రమకు హీరోలను అందిస్తున్న ఫ్యామిలీ మాత్రమే కాదు.. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాలుగా మెగా ఫ్యామిలీ పాతుకుపోయింది. ఓటీటీ సంస్థ దగ్గర నుంచి నిర్మాణం, చివరకు డిస్ట్రిబ్యూషన్ కూడా మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జస్ట్ టిక్కెట్ అనే సంస్థ కూడా మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తులదే. […]