AP New Districts-CM Jagan: ఏపీలో కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి. ముందు నుంచి చెబుతున్నట్టు గానే ఉగాది సందర్భంగా కొత్త జిల్లాలో పాలన కొత్త తెలుగు సంవత్సరంలో మొదలైంది. సీఎం జగన్ ఈరోజు అమరావతి వేదికగా కొత్త జిల్లాలను వర్చువల్ తో ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ బటన్ నొక్కి కొత్త జిల్లాల ఉనికిని స్టార్ట్ చేశారు. వాస్తవంగా ఏదో ఒక జిల్లాకు వెళ్లి ఈ ప్రారంభ వేడుకను నిర్వహిస్తారని అంతా అనుకున్నారు.
కానీ ఏమైందో ఏమో తెలియదు.. జగన్ మాత్రం అమరావతి నుండి కొత్త జిల్లాలను ప్రారంభించారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లాల్లో ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఒక్క జగన్ మాత్రమే అమరావతి ఉండిపోయారు. ఇక కొత్త జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ భౌగోళిక రూపం మారిపోయింది.
Also Read: New Trend Of Political Parties: రాజకీయ పార్టీల కొత్త పంథా…సోషల్ మీడియా వింగ్ బలోపేతం
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఈరోజు నుంచి కొత్త పనికి శ్రీకారం చుట్టామని.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఇక పాత జిల్లా కేంద్రంలోని అలాగే కాపాడుకున్నామని.. దానికి తోడు 13 కొత్త జిల్లాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. అధికార వికేంద్రీకరణ కోసమే ఈ పని చేపట్టామని జగన్ చెప్పుకొచ్చారు. కొత్త జిల్లాల ప్రారంభం సందర్భంగా గా జగన్ నోటి నుంచి కేవలం అధికార వికేంద్రీకరణ మాటలు వచ్చాయి తప్ప.. అభివృద్ధి అనే మాట మాత్రం రాలేదు.
కొత్త జిల్లాలు అంటే కచ్చితంగా మరింత అభివృద్ధిని ప్రజలు ఆకాంక్షిస్తారు. కొత్త జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలు ఇతరత్రా శాఖలకు బిల్డింగులు నిర్మించాల్సి ఉంటుంది. కొత్త జిల్లా పరిషత్ లకు నిధులు కేటాయించాలి. కానీ జగన్ ప్రసంగంలో ఇవేవి మాట వరసకైనా రాలేదు. కనీసం కొత్త బిల్డింగుల ముచ్చట కూడా జగన్ ఎత్తలేదు.
వాస్తవంగా జిల్లా కేంద్రాలకు అదనంగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. అప్పుడే అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది. కానీ జగన్ ఇవన్నీ పక్కన పెట్టేసి.. కేవలం పాలన వికేంద్రీకరణ మాట మాత్రమే మాట్లాడారు. దాన్ని బట్టి చెప్పొచ్చు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో. మరి అభివృద్ధి జరుగుతుందనే కదా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేది. కానీ అసలైన దాన్ని పక్కన పెట్టేసి ఉత్తుత్తి మాటలు చెప్పడం ఎంత వరకు కరెక్ట్.
Also Read:New Trend Of Political Parties: రాజకీయ పార్టీల కొత్త పంథా…సోషల్ మీడియా వింగ్ బలోపేతం