Rashmika Mandanna: ఆడవాళ్ళూ మీకు జోహార్లు నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. రష్మిక మందాన హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీని కిషోర్ తిరుమల డైరెక్ట్ చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, శ్రీమణి సాహిత్యం ఈ పాటకు ఆయువు పట్టుగా నిలిచాయి. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీ ట్రైలర్, ప్రోమో, సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
ఇక ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ప్రమోషన్ ఈవెంట్లో మహిళల డ్రెస్సింగ్‌పై రష్మిక మందాన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘మహిళల డ్రెస్సింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ ఈవెంట్‌కు వెళ్లాలన్నా గంటల తరబడి రెడీ అవ్వాల్సి వస్తుంది. అదే అబ్బాయిలైతే సింపుల్‌గా రెడీ అయ్యి వెళ్లొచ్చు. అందుకే వచ్చే జన్మంటూ ఉంటే అబ్బాయిగా పుట్టాలనుంది’ అంటూ రష్మిక సరదాగా చెప్పింది. నైస్ పర్సన్ భర్తగా కావాలంది.
Also Read: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్
హిందీలో వరుస ఆఫర్స్ వస్తుండగా రష్మిక ముంబైలో ఎక్కువగా కనిపిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న మిషన్ మజ్ను మూవీ చేస్తున్న ఆమె, అమితాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గుడ్ బై మూవీలో నటిస్తోంది. అలాగే తెలుగులో శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ఆడాళ్లు మీకు జోహార్లు మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక యువ హీరో విజయ్ దేవరకొండ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు రష్మిక. వీరిద్దరూ కలిసి చేసింది రెండు సినిమాలే కానీ క్రేజ్ మాత్రం ఫుల్‌గా సొంతం చేసుకున్నారు. అయితే ఈ జంట.. ఈ ఏడాది చివర్లో పెళ్లి పీటలెక్కనుందంటూ తెగ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల పై ఆమె ఇంతవరకు రియాక్ట్ కాలేదు.
Also Read: ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. మూవీ అలా ఉంటుందట