https://oktelugu.com/

International Friendship Day: అందమైన ఈ కొటేషన్స్ ద్వారా మీ స్నేహితుడికి శుభాకాంక్షలు తెలపండి..

అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రతీ ఏడాది ఆగష్టు మొదటి వారంలో జరుపుకుంటారు. ఈసారి వచ్చే ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకునేందకు ఫ్రెండ్స్ రెడీ అవుతున్నారు. అయితే ఒకప్పుడు స్నేహితులంతా ఒక్కచోట ఉండేవారు.. ఒకే గ్రామంలో జీవించేవారు.. కానీ ఇప్పుడు వివిధ ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం స్నేహితులు దూరమవుతున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 30, 2024 / 05:04 PM IST

    International Friendship Day

    Follow us on

    International Friendship Day: ప్రపంచంలో అందమైన బంధం ఏదంటే అది స్నేహం అని కొందరు అంటారు. ఒక వ్యక్తి తన సర్వస్వం మరో వ్యక్తి.. అంటే స్నేహితుడితో మాత్రమే షేర్ చేసుకుంటాడు. తల్లీదండ్రులు,సోదరులు, బంధువులకు చెప్పేలని ఎన్నో విషయాలు ఫ్రెండ్స్ తో పంచుకుంటారు. నిజమైన స్నేహితులు ఆపద సమయంలో ఒకరినొకరు ఆదుకుంటారు. అంతటీ అందమైన బంధం కలకాలం ఉండాలని, స్నేహాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రత్యేకంగా ఓ రోజును కేటాయించారు. దానినే స్నేహితుల దినోత్సవం అని అంటున్నారు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రతీ ఏడాది ఆగష్టు మొదటి వారంలో జరుపుకుంటారు. ఈసారి వచ్చే ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకునేందకు ఫ్రెండ్స్ రెడీ అవుతున్నారు. అయితే ఒకప్పుడు స్నేహితులంతా ఒక్కచోట ఉండేవారు.. ఒకే గ్రామంలో జీవించేవారు.. కానీ ఇప్పుడు వివిధ ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం స్నేహితులు దూరమవుతున్నారు. ఒకరికొకరు కనిపించకుండా ఖండాలు దాటేస్తున్నారు. ఈ తరుణంలో ఏడాదిలో ఒక్కసారైనా స్నేహితులంగా కలుసుకోవాలని అనుకుంటున్నారు. నేరుగా వీలు కాని వాళ్లు ఆన్ లైన్ లో కలుసుకుంటున్నారు. అయితే ఇలా కలవని వారి కోసం.. వారిని గుర్తు చేసుకుంటూ విషేష్ చెప్పాలని ఎందరో అనుకుంటారు. కానీ ఎలా చెప్పాలి? అన్న ప్రశ్న ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో సాధారణంగా కాకుండా ఏదైనా మంచి మాట ద్వారా శుభాకాంక్షలు తెలపడం ద్వారా ఎదటి వారి మనసుకు నచ్చుతుంది. అంటి కొటేషన్లు మీ కోసం ఇక్కడున్నాయి. వీటితో స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి మీ ప్రత్యేక స్నేహితుడి మనసును గెలుచుకోండి..

    ‘హ్యాప్యీ ఫ్రెండ్సిఫ్ డే.. నా బెస్ట్ ఫ్రెండ్ కి ఆనందం, నవ్వు అందించినందుకు ధన్యవాదాలు..

    ‘మీలాంటి స్నేహితుడు దొరకడం అరుదు.. మీతో స్నేహం చేయడం అద్భుతం.. స్నేహితుల దినోతవ్స శుభాకాంక్షలు’

    ‘మీరు నాతో స్నేహం చేయడం ద్వారా ప్రపంచం ప్రకాశవంతంగా కనిపిస్తుంది..హ్యాప్యీ ఫ్రెండ్సిఫ్ డే’

    International Friendship Day

    ‘నా అందమైన స్నేహితుడైన మీరు కుటుంబ సభ్యుల్లో ఒకరైనందుకు ధన్యవాదాలు.. హ్యాప్యీ ఫ్రెండ్సిఫ్ డే.’

    ‘స్నేహం అనేది అలా వచ్చి.. ఇలా విడిపోవడం కాదు.. జీవితాంతం కలిసి ఉండేది..’హ్యాప్యీ ఫ్రెండ్సిఫ్ డే..

    ‘నా కోసం.. నాతోడు.. నా వెంటే ఉన్నందుకు ధన్యవాదాలు..’ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..

    ‘మన స్నేహం రోజురోజుకు మరింత బపడాడాలని కోరుకుంటూ..’ హ్యాప్యీ ఫ్రెండ్సిఫ్ డే…

    ‘మన స్నేహం.. విలువైన బహుమతి.. ఎప్పటికీ ఈ బంధంకొనసాగాలని..’ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..

    ‘ప్రేమ యొక్క ముధురమైన రూపం స్నేహం.. ఈ రూపం నాతోడు ఉన్నందుకు ధన్యవాదాలు..’

    ‘ప్రేమ, ఆనందం, ప్రతిష్టాత్మకమైన క్షణాలతో కూడిన మన బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ.. ’

    ‘ప్రతి క్షణం సంతోషంగా ఉండేది ఒక్క స్నేహితుడితోనే..’

    ‘జీవితంలో అందమైన బంధం.. స్నేహం మాత్రమే’..

    ‘రెండు అందమైన హృదయాలను కలిపితే ఏర్పడేది స్నేహం..’

    ‘ప్రతీ విషయంలో తోడుంటూ.. ప్రతీక్షణ మద్దతు పలికి నా స్నేహితుడికి.. హ్యాపీ ఫ్రెండ్సిఫ్ డే..’

    ‘అరుదైన రత్నం మన స్నేహం..’

    International Friendship Day

     

    ‘నీతో స్నేహం చేస్తే నా హృదయం ప్రశాంతం.. మన జీవితాల్లో మరిన్ని ఆనందాలు రావాలి..

    ‘నా కోసం నిత్యం సాహసం చేసే నా స్నేహితుడికి.. హ్యాపీ ఫ్రెండ్సిప్ డే..’

    ‘జీవితంలో గొప్ప బహుమతి స్నేహం.. ఈ బహుమతిని దూరం చేసుకోవద్దని కోరుకుంటున్నా..’

    ‘ప్రేమ, నవ్వు, సంతోషం నిండిన వ్యక్తి దగ్గర ఉండడమే స్నేహం’

    ‘ఒక వెలుగు, ఒక సంతోషం స్నేహితుడి వద్ద మాత్రమే లభిస్తుంది’

    ‘లెక్కలేనన్ని గుర్తులు.. సంతోషాలు.. అందించేది స్నేహితుడు మాత్రమే’

    ‘ప్రతిరోజూ ఆదరించే ఒక వరం స్నేహం.. ఈ స్నేహం కలకాలం ఉండాలి’..

    ‘ప్రతీ క్షణం సంతోషాన్ని పంచేది స్నేహితుడు మాత్రమే’.. హ్యాపీ ఫ్రెండ్సిప్ డే..