Internal Vs External Locus Of Control: ఏం జరిగినా టెన్షన్ పడిపోయి బీపీ పెంచుకునే వర్గం ఒకటి. ఏం జరిగినా చూసుకుందాం అని టెన్షన్ ఫ్రీగా ఉండే బ్యాచ్ మరొకటి.
Also Read: కవిత వ్యాఖ్యలు.. రేవంత్ చెప్పిన పాముల కథ..మామూలు పంచ్ కాదు ఇది
మొదటి వర్గం 1 అనుకుంటే.. రెండో బ్యాచ్ 100. మనుషులు అందరూ ఒకటి నుంచి వంద వరకూ ఏదో ఒక డిగ్రీలో ఉంటారు. దీన్ని డిసైడ్ చేసేది లోకస్ ఆఫ్ కంట్రోల్.
Internal Locus of Control లో ఉన్న వ్యక్తులు తమ జీవితంలో జరిగే సంఘటనలు, విజయాలు, వైఫల్యాలకు తామే కారణమని నమ్ముతారు. మన పని, మన టాలెంట్, కష్టపడే మన స్వభావమే రిజల్ట్స్ ను డిసైడ్ చేస్తదని విశ్వసిస్తారు.
For example.. పరీక్షలో మంచి మార్కులు వస్తే, అది తాము బాగా చదువుకోవడం వల్లే అని భావిస్తారు. మంచి జాబ్ కొడితే సరైన ప్రిపరేషన్ వల్లనే అనుకుంటారు. అంటే.. మన జీవితం మన చేతుల్లోనే ఉందని నమ్ముతారు.
External Locus of Controlలో ఉన్న వ్యక్తులు పూర్తిగా రివర్స్. అదృష్టం, విధి, తలరాత, చేతిరాత, మన్ను మశానం అని భావిస్తారు. వాడి వల్లే, వీడి వల్లే నా బతుకు ఇట్లా తగలబడిందని ఏడుస్తారు. సక్సెస్ వస్తే దాన్ని భద్రంగా తీసుకెళ్లి హుండీలోనో, బాబా కాళ్ల దెగ్గరనో క్రెడిట్ చేస్తారు.
అంటే.. తమ జీవితం తమ చేతిలో లేదని, తమ life రిమోట్ వేరేవాళ్లు ఆపరేట్ చేస్తున్నారని నమ్ముతారు.
ఈ రెండు రకాల వ్యక్తుల మానసిక స్థితి, ఆందోళన చాలా డిఫరెంట్ గా ఉంటుంది. Problems Face చేసే విధానం, జీవితంపై వారి అభిప్రాయాలు, నమ్మకాల ఆధారంగా ఈ తేడాలు కనిపిస్తాయి.
Responsibility తీసుకోవడమే External నుంచి బయట పడడానికి ఏకైక మార్గం
– నక్కా రాధాకృష్ణ