Interesting Facts: కేకలు ఎందుకు వేస్తారు? అరుపులపై వెల్లడైన ఆసక్తికర విషయాలు

Interesting Facts: మనుషులు తమ హావభావాలు ప్రకటించుకునేందుకు మాట అనే ఆయుధం ఉంది. కానీ జంతువులకు లేదు. వాటికి మాటలు రావు. మానవులు మాత్రం తమలోని అభిప్రాయాలు పంచుకునే క్రమంలో ఎన్నో మాటలు మనకు అందుబాటులో ఉన్నాయి. భూమి మీద ఉన్న ప్రాణికోటికి బతుకు అనేది సాధారణమే. ఇందులో భాగంగా ఒక్కో జంతువు మరో జంతువును వేటాడటం కూడా చూస్తాం. జంతువులకు అరుపులే ఆయుధాలు. కానీ మనుషులకు మాటలే దారులు. సంతోషం వచ్చినా, బాధ కలిగిన మనం […]

Written By: Srinivas, Updated On : November 29, 2021 6:43 pm
Follow us on

Interesting Facts: మనుషులు తమ హావభావాలు ప్రకటించుకునేందుకు మాట అనే ఆయుధం ఉంది. కానీ జంతువులకు లేదు. వాటికి మాటలు రావు. మానవులు మాత్రం తమలోని అభిప్రాయాలు పంచుకునే క్రమంలో ఎన్నో మాటలు మనకు అందుబాటులో ఉన్నాయి. భూమి మీద ఉన్న ప్రాణికోటికి బతుకు అనేది సాధారణమే. ఇందులో భాగంగా ఒక్కో జంతువు మరో జంతువును వేటాడటం కూడా చూస్తాం. జంతువులకు అరుపులే ఆయుధాలు. కానీ మనుషులకు మాటలే దారులు.

సంతోషం వచ్చినా, బాధ కలిగిన మనం ఓ రకమైన అరుపులు చేస్తాం. వాటిని కేకలు, కేరింతలు, ఇంకా పలు రకాలుగా అభివర్ణిస్తూ ఉంటారు. సాధారణంగా మనకు ఓ కోటి రూపాయల లాటరీ తగిలితే యాహూ అని పెద్దగా కేక పెడతాం. అదే ఏదైనా ప్రమాదం చోటుచేసుకున్నప్పుు మరోలా పెద్దగా శబ్ధం చేస్తాం. ఏదైనా ప్రమాదం జరిగే సమయంలో మనలో మాట కంటే అరుపు ఎక్కువగా బయటకు వస్తుంది.

ప్రతి విషయంలో భావవ్యక్తీకరణ కుదరకపోవచ్చు. సంతోషం పెరిగినప్పుు మనం వ్యక్తం చేసే అరుపు ఒకలా ఉంటే బాధ కలిగినప్పుడు మనం చేసే శబ్ధం వేరే విధంగా ఉండటం తెలిసిందే. అరుపులు పలు రకాలుగా ఉండటం చూస్తుంటాం. సంతోష సమయాల్లో యాహూ అని బాధలు తలెత్తే సమయంలో కన్నీటితో కూడిన శబ్దాలు వినిపిస్తుంటాయి.

Also Read: I married my dog: శునకమే కనకం.. కుక్కను పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తున్న మహిళ

ప్రతి రోజు మనం చేసే పనుల్లో భాగంగా కొన్ని అరుపులతో సంబంధం ఉంటాయి. మనం ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు పిలిచే పిలుపు కూడా అరుపులాగే ఉంటుంది. ప్రమాదం జరిగే సమయంలో కూడా అరుపులే ఆయుధాలుగా ఉపయోగపడతాయి దీంతో అరుపుకు ప్రాధాన్యం ఏర్పడిందని తెలుస్తోంది.

Also Read: Bride Going to Exam Hall:ప్రతీ ఆడపిల్లకు ఈ పెళ్లికూతురు ఆదర్శం..ఏం చేసిందో చూడండి..

Tags