https://oktelugu.com/

Drushyam 2: నేడు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన వెంకటేష్ “దృశ్యం 2 ” …

Drushyam 2: విక్టరీ వెంక‌టేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే నారప్ప తో సాలిడ్ ఐ‌టి అందుకున్న వెంకీ మరోమారు ఓటిటి వేదికగా మరో సినిమాను రిలీజ్ చేశాడు. 2011లో ఆయన హీరోగా నటించిన “దృశ్యం” మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనా నటించారు.  కుటుంబ నేపథ్యం మీద తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించగా తెలుగులో వెంకటేష్ రీమేక్ చేశారు. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 25, 2021 / 10:48 AM IST
    Follow us on

    Drushyam 2: విక్టరీ వెంక‌టేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే నారప్ప తో సాలిడ్ ఐ‌టి అందుకున్న వెంకీ మరోమారు ఓటిటి వేదికగా మరో సినిమాను రిలీజ్ చేశాడు. 2011లో ఆయన హీరోగా నటించిన “దృశ్యం” మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనా నటించారు.  కుటుంబ నేపథ్యం మీద తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించగా తెలుగులో వెంకటేష్ రీమేక్ చేశారు. కాగా ఇప్పుడు దృశ్యం చిత్రానికి సీక్వెల్ గా “దృశ్యం 2” తెరకెక్కించారు. ఈ రోజు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మూవీ విడుద‌ల అయింది. ప్ర‌స్తుతం సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని వ్యూస్ ప‌రంగా దూసుకుపోతుంది.

    venkatesh drushyam 2 movie released in amazon prime

    Also Read: దృశ్యం2 రివ్యూ

    ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి లోనే మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌ల‌యాళంలో పెద్ద హిట్ గా కూడా నిలిచింది. ఈ సినిమాలో  రాంబాబు హ‌త్య చేశాడ‌ని ఐజీ గౌత‌మ్ సాక్షాల‌ను సంపాదిస్తాడు. దీంతో రాంబాబును పోలీసులు అరెస్టు చేస్తారు. దీంతో మళ్ళీ రాంబాబు త‌న కుటుంబాన్ని ఈ కేసు నుంచి ఎలా బ‌య‌ట ప‌డేశాడో అనేది క‌థ‌. అయితే ఈ సినిమా మొద‌టి పార్ట్ కన్నా థ్రిల్లింగ్ గా ఉంటుంద‌ని అంటున్నారు.

    అలానే వెంకటేష్ తన అన్న కొడుకు రానాతో కలిసి నెట్ ఫ్లిక్స్ కోసం ఒక వెబ్ సిరీస్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. మరో వైపు వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 3 సినిమాలో నటిస్తున్నాడు వెంకీ మామ. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరి కాంబోలో నిర్మింకిన ఎఫ్ 2 కి సీక్వెల్ గా దీన్ని చేస్తున్నారు. ఐతే తాను ప్రస్తుతం ఏ సినిమాకి ఒకే చెప్పలేదని… తననేవారు స్క్రి[పి‌టి తో వాచీ కలవలేదని చెప్పారు.

    Also Read: సినిమాలో నటించే వరకే నా బాధ్యత.. విడుదల విషయంలో జోక్యం చేసుకోను- వెంకి