https://oktelugu.com/

Milk: డిటర్జెంట్, గంజి పొడితో పాల తయారీ.. కల్తీ పాలను ఏ విధంగా గుర్తించాలంటే?

Milk: మనలో చాలామంది ప్రతిరోజూ తాగే పాలు స్వచ్చమైన పాలు అని భావిస్తున్నారు. అయితే కొంతమంది రసాయనాలు కలిపిన పాలను విక్రయిస్తూ అధికారులకు పట్టుబడుతున్నారు. రసాయనాలతో తయారు చేసిన పాలను తాగడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు మూడేళ్ల క్రితం సేకరించిన పాలలో 7 శాతం పాలు నాణ్యతతో లేవని వెల్లడించారు. అమ్మోనియం సల్ఫేట్, క్లోరిన్, బోరిక్ ఆమ్లం కలపడం ద్వారా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 4, 2022 1:10 pm
    Follow us on

    Milk: మనలో చాలామంది ప్రతిరోజూ తాగే పాలు స్వచ్చమైన పాలు అని భావిస్తున్నారు. అయితే కొంతమంది రసాయనాలు కలిపిన పాలను విక్రయిస్తూ అధికారులకు పట్టుబడుతున్నారు. రసాయనాలతో తయారు చేసిన పాలను తాగడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు మూడేళ్ల క్రితం సేకరించిన పాలలో 7 శాతం పాలు నాణ్యతతో లేవని వెల్లడించారు.

    Milk

    Milk

    అమ్మోనియం సల్ఫేట్, క్లోరిన్, బోరిక్ ఆమ్లం కలపడం ద్వారా కొంతమంది పాలు చిక్కగా ఉండేలా చేస్తున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా ప్యాకెట్ పాలు తాగేవాళ్లు ఆ పాలు కల్తీ పాలు అవునో కాదో పరీక్షలు చేసి తెలుసుకుంటే మంచిది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సులభంగానే పాలు కల్తీ పాలో కాదో గుర్తించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పిల్లలు కల్తీ పాలు తాగడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

    Also Read: చరిత్రలో నిలిచేలా శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు.. రేపు ప్రధాని రాక..

    పాలలో నీళ్లు పోసి చెంచాతో తిప్పితే డిటర్జెంట్ పొడి కలిపిన పాలు నురగ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని గుర్తుంచుకోవాలి. పాలలో కొంచెం నీళ్లు పోసి మరగబెట్టి చల్లార్చి ఆ తర్వాత అందులో టించర్ అయోడిన్ ను కలిపితే మంచిది. కల్తీ పాలు అయితే పాలు నీలి రంగులోకి మారతాయి. మార్కెట్ లో దొరికే యూరియా సే స్ట్రిప్స్ సహాయంతో పాలలో యూరియాను గుర్తించే అవకాశం ఉంటుంది.

    పాలను నేలపై పోస్తే నాణ్యమైన పాలు సన్నటి ధారలా పారే అవకాశం ఉండగా ధార దూరాన్ని బట్టి అవి పాలను గుర్తించవచ్చు. పాలు వేగంగా పారితే నీళ్లు కలిపారని మెల్లగా కదిలితే స్వచ్చమైన పాలు అని గుర్తించాలి. కల్తీ పాల వల్ల క్యాన్సర్ తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.

    Also Read: చలో విజయవాడ సక్సస్.. ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనా?