House Wife Facts: ఇంటికి దీపం ఇల్లాలు.. ఈ మాట పూర్వం నుంచే చెబుకుంటూ వస్తున్నారు. నిజమే మరి. ఇంట్లో వ్యక్తుల ఎదుగుదల కోసమైనా, ఈ ఇల్లు బాగుండటం కోసం ఇల్లాలు తీరు మూల కారణం. కొందరు పండితులు ఇల్లాలు గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఇల్లాలు చేయాల్సిన పనులేంటి. మరి చేయకూడని పనులేంటి అనేవి కొన్నింటిని ఉదాహరణగా వివరించారు. ఇంట్లో ఏ పని స్టార్ట్ చేయాలన్నా దానిని శుక్ల పక్షంలోనే చేయాలి. అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు మాత్రమే చేయాలి. ఇంట్లో ఎవరూ దిండ్లపై కూర్చోవద్దు. రాత్రి టైంలో చాలా మంది గాజులు, కమ్మలు తీస్తుంటారు కానీ అలా చేయకూడదు. ఇంట్లో ఏదైనా బాధాకర ఘటనలు జరిగినప్పుడు పలకరించేందుకు వాచ్చిన వారికి ఎదురెళ్లి ఆహ్వానించొద్దు. ఇక వారు తిరిగి వెళ్లేటప్పులు వెళ్లి వస్తానని చెప్పొ్ద్దు.

కొత్త బట్టలు వేసుకనేటప్పుడు దానికి కొంత పసుపు రాయాలి. ఒకరు ధరించిన పూలను మరో స్ట్రీ పెట్టుకోకూడదు. నలుపు రంగు దుస్తులు వేసుకోవద్దు. ఉప్పు, మిరపకాయలు, చింతపండు, ధాన్యాల వంటివి ఎవరికీ చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. ప్రతి రోజు తినేముందు కాకులకు భోజనం పెట్టాలి.
Also Read: తక్కువ ఖర్చుతో ఆరోగ్యం పొందాలా ? ఐతే ఈ పండు తినండి !
దీని వల్ల పితృదేవతలకు సంతృప్తి కలుగుతుంది. కొబ్బరి చిప్పను తాంబూలంగా ఇచ్చే వారు మూడు కళ్లు ఉన్న భాగాన్ని ఉంచుకుని మిగతా భాగాన్ని ఇవ్వాలి. ఇంట్లో స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరపోసుకుని ఉందొద్దు. దీని వల్ల పనికి ఆటంకాలు ఎదురవుతాయట. జీతం వచ్చిన వెంటనే ఆ డబ్బుతో కొంత ఉప్పుకొనాలి దీని వల్ల సంపద అభివృద్ధి చెందుతుందట. ఆడవారు కాలు మీదు కాలు వేసుకోవడం, కాలు ఊపడం వంటివి చేయొద్దు. ఇలా చేస్తే దరిద్రంగా భావిస్తారట.
దీనికి తోడు శరీరంలోని ఎముకలు బలహీనంగా మారి త్వరగా విరిగిపోయేందుకు అవకాశం ఉంటుందట. ఎదుటివారికి ఏమైనా ఇచ్చే టైంలో కుడి చేతిని ఉపయోగించాలి. సుమంగళి స్త్రీలు రాత్రిటైంలో అలిగి ఆహారం తినకుండా నిద్రపోవద్దు. పూలు అమ్మకానికి వస్తే నాకు వద్దు అని చెప్పొద్దు. రేపు తీసుకుంటాను అని చెప్పాలట. ఇంటి ఇల్లాలి నోటి నుంచి ఎప్పుడూ దరిద్రం, పేద, పీనుగా, శని, కష్టం అనే పదాలు వినిపించొద్దు. ఇంటిలో దుమ్ము, ధూళి, దారిద్ర హేతువులు, కావున ఇంటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
Also Read: పూర్వం బట్టలను సబ్బులు లేకుండా ఎలా ఉతికేవారో మీకు తెలుసా?
[…] […]