Pawan Kalyan : సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోలకు మాత్రమే ఫ్యాన్స్ ఉంటారు. వాళ్లకు మాత్రమే అభిమాన సంఘాలు ఉంటాయి. స్టార్ హీరోలు అయిన తర్వాత వాళ్ళని ఆరాధించే వాళ్ల సంఖ్య కోట్లలోకి పెరిగిపోతోంది. హీరోల బర్త్ డే రోజున అభిమానులు రక్తదానాలు చేయడం లాంటి సేవా కార్యక్రమాలను చేపడతారు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘చిరంజీవి’ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన ‘పవన్ కళ్యాణ్’ చాలా తక్కువ సమయంలోనే అవతరించాడు. ఇక అలాంటి పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ప్రతి సినిమా అప్పట్లో పెను సంచలనాన్ని క్రియేట్ చేసేది. ఇక ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నప్పటికి అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తూ తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది దర్శకులు పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయాలని ఆసక్తి చూపిస్తుంటే ఒక దర్శకుడు మాత్రం పవన్ కళ్యాణ్ నాకు సెట్ అవ్వడు. నేను అతనితో సినిమాలు చేయలేను అంటూ ఓపెన్ గా చెప్పేసాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే బోయపాటి శ్రీను…
ఆయన బాలయ్య తో చేసిన సినిమాలతో గొప్ప విజయాలను సాధించాడు. అలాగే అల్లు అర్జున్ తో ‘సరైనోడు’ అనే సినిమా చేసి గొప్ప విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే బోయపాటి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు మీరు పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు చేస్తారు అని అడగ్గా దానికి బోయపాటి ఇలా సమాధానం ఇచ్చాడు…
పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో పాలిటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి తను చాలా లిమిటెడ్ గా డేట్స్ ఇస్తాడు. ఆయన తక్కువ డేట్స్ ఇచ్చినప్పుడు నేను వాళ్లతో అంత ఎఫెక్ట్ గా సినిమా చేయలేను అంటూ చెప్పాడు. అలాగే నాకు హీరోల డేట్స్ చాలా ఎక్కువగా కావాలి. అలాంటప్పుడే నేను అనుకున్నది అనుకున్నట్టుగా తెర మీద చూపించగలుగుతాను.
పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని నాకు ఉంది. కానీ సినిమా చేస్తే మాత్రం అతని డేట్స్ బల్క్ గా కావాలి. ప్రస్తుతం ఆయన అన్ని డేట్స్ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి నేను అతనితో సినిమా చేయకపోవడమే బెటర్ అంటూ బోయపాటి శ్రీను మాట్లాడిన మాటలు ప్రస్తుత సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి…