India vs Bangladesh 2nd Test: నిన్న మొదలైన రెండో టెస్ట్ లో బంగ్లాదేశ్ ను 227 పరుగులకు ఆల్ అవుట్ చేసి భారత బౌలర్లు సత్తా చాటితే… రెండో రోజు బ్యాటింగ్ దిగిన భారత బ్యాట్స్ మెన్ చకచకా అవుట్ చేసి బంగ్లాదేశ్ బౌలర్లు తమ దమ్ము చూపారు. 94 పరుగులకే నాలుగు కీలక వికెట్లు తీసి భారత జట్టును కష్టాల్లోకి నెట్టారు.. ఈ సమయంలో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ నిలబడకపోయి ఉంటే కథ మరోలా ఉండేది.

ఇదేం ఆట?
భారత జట్టును నడిపిస్తున్న నాయకుడు వరుసగా కే ఎల్ రాహుల్ విఫలమవుతున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్ లోనూ కేవలం పది పరుగులు చేసి ఎల్బీ డ బ్ల్యూ అవుట్ అయ్యాడు.. 20 పరుగులు చేసి సౌకర్యవంతంగా కనిపించిన శుభ్ మన్ గిల్ కూడా కెప్టెన్ బాటనే అనుసరించాడు.. మొదటి టెస్ట్ లో భారీగా పరుగులు సాధించిన పూజారా ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు.. కోహ్లీ కూడా 24 పరుగులు చేసి క్యాచ్ అవుట్ గా వెను తిరిగాడు. అప్పటికి భారత్ స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 94 పరుగులు. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అబేధ్యమైన ఐదో వికెట్ కు 159 పరుగులు జోడించారు.. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని హసన్ మీరాజ్ విడదీసాడు. లేకుంటే భారత్ స్కోరు 400 దాటేది. చాలా రోజుల తర్వాత పంత్ తన సహజ శైలిలో ఆడాడు. ఏడుపరుగుల దూరంలో సెంచరీ కోల్పోయాడు. తర్వాత కొద్ది సమయానికి అయ్యర్ కూడా అవుట్ అయ్యాడు. అయ్యర్ 87 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన అక్షర్, అశ్విన్, ఉమేష్, సిరాజ్ పెద్దగా ప్రభావం చూపలేదు.. దీంతో భారత్ ఇన్నింగ్స్ 314 పరుగుల వద్ద ముగిసింది. దీంతో బంగ్లా జట్టుపై 87 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ వికెట్లు ఏమి కోల్పోకుండా ఏడు పరుగులు చేసింది.

సత్తా చాటిన బంగ్లాదేశ్ బౌలర్లు
ఉదయం మైదానంపై ఉన్న తేమను సద్వినియోగం చేసుకుంటూ బంగ్లాదేశ్ బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేశారు. కట్టుదిట్టమైన బంతులు వేస్తూ భారత బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టారు. 94 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు తీశారు అంటే బంగ్లా బౌలర్లు ఏ స్థాయిలో బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా షకీబ్, తైజుల్ ఇస్లాం చేరో నాలుగు వికెట్లు తీసి భారత్ ఇన్నింగ్స్ ఒక్క రోజులోనే ముగిసేందుకు కారణమయ్యారు.
అయితే భారత్ 4 వికెట్లు కోల్పోయిన తర్వాత అయ్యర్, పంత్ దాటిగా ఆడారు.. వీరి బ్యాటింగ్ వన్డే మ్యాచ్ ను తలపించింది..క్రీజులో వీరు ఉన్నంత సేపు స్కోర్ బోర్డు చక చకా కదిలింది.. మొదట్లో నాలుగు వికెట్లు తీసి సంబరాలు జరుపుకున్న బంగ్లాదేశ్ బౌలర్లు… వీరిని విడదీసేందుకు మాత్రం నానా తంటాలు పడ్డారు.. స్పిన్ ట్రాక్ కు సహకరిస్తున్న మైదానంపై ఇస్లాం వికెట్లు రాబట్టాడు