India Richest Car: లగ్జరీగా జీవించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. బాగా ఖరీదు ఉండే కార్లు, బైక్‌లు ఇలా ప్రపంచంలో ఉన్న అన్ని లగ్జరీ వస్తువులను అనుభవించాలని కోరుకుంటారు. అయితే ఈ ప్రపంచంలో ఎన్నో ఖరీదైన వస్తువులు ఉన్నాయి. ఇలాంటి ఖరీదైన వస్తువులను కేవలం ధనవంతులు మాత్రమే ఉపయోగిస్తుంటారు. సాధారణ మధ్యతరగతి మనుషులు వీటిని వాడటం కష్టమే. చాలా మంది కారులో ప్రయాణించాలని కోరుకుంటారు. దేశంలో ఎన్నో లగ్జరీ కారులు కూడా ఉన్నాయి. ధనవంతులు కోసం ఎన్నో ఫీచర్లతో కొత్త కొత్త బ్రాండ్‌లతో కార్లను కంపెనీలు తీసుకొస్తుంటాయి. అయితే మన దేశంలో ఖరీదైన ఓ కారు ఉంది. ఇలాంటి ఖరీదైన కారును కేవలం ధనవంతులు, బిలియనీర్లు, మిలియనీర్లు మాత్రమే వాడుతుంటారు. అయితే మన దేశంలో అంటే ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ, గౌతమ్ అదానీ ఇలా వీళ్ల దగ్గరే ఇలాంటి ఖరీదైన కార్లు ఉంటాయని అందరూ భావిస్తారు. మీరు కూడా ఇలానే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే దేశంలో ఉన్న ఖరీదైన కారును వీరి దగ్గర లేదు. మరి ఎవరి దగ్గర ఉంది? ఆ కారు పేరు ఏంటి? దాని ఖరీదు ఎంత? పూర్తి వివరాలు తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.
దేశంలో అత్యంత ఖరీదైన కారు ప్రముఖ వ్యాపారవేత్త అయిన వీఎస్ రెడ్డి దగ్గర ఉంది. బెంట్లీ ముల్సన్నే ఈడబ్ల్యూబీ సెంటెనరీ ఎడిషన్ అనే కారు దేశంలో ఖరీదైనది. ఈ కారు కేవలం వీఎస్ రెడ్డి దగ్గర మాత్రమే ఉంది. ఈ బెంట్లీ ముల్సన్నే ఈడబ్ల్యూబీ సెంటెనరీ కారును బెంట్లీ కంపెనీ స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ కారుగా తయారు చేసింది. దీని ధర రూ.14 కోట్లు. బ్రిటిషన్ బయోలాజికల్స్ కంపెనీ వ్యవవ స్థాపకులు అయిన వీఎస్ రెడ్డికి కార్లు అంటే చాలా ఇష్టం. ఈయన ఎక్కువగ కార్లను కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చిన కూడా వెంటనే ఆయన కొనుగోలు చేస్తుంటారు. ఇప్పటికీ ఇతను బ్రిటిషన్ బయోలాజికల్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. మార్కెట్లోకి వచ్చిన ఏ కొత్త బ్రాండ్ కారు అయిన తప్పకుండా తన గ్యారెజీలో ఉండాల్సిందే. దాని ఖరీదు ఎంత ఉన్నా కూడా తప్పకుండా కొనుగోలు చేస్తుంటారు. ఎంత ఖరీదైన కారు అయిన మొదటిగా తాను కొనుగోలు చేయాలని భావిస్తారు. ఇది తన చిన్నప్పటి కల.
ఎన్ని కార్లు బ్రాండ్‌లు ఉన్నాయో.. అన్ని కూడా తన గ్యారెజీ ఉండాలని చిన్నిప్పటి నుంచి కలల కన్నారట. బెంట్లీ సంస్థ నుంచి వచ్చిన ఈ స్పెషల్ ఎడిషన్ కారును తాజ్ మహాల్ ఆఫ్ కార్స్‌గా వీఎస్ రెడ్డి తెలిపారు. రోస్ రెడ్ కలర్‌లో ఉండే ఈ కారు లుక్ భలే ఉంటుంది. ఈ కారుకి అలెయ్ వీల్స్, లెదర్ అప్హోల్స్టరీ, వెనుక క్యార్టర్ వానిట్రీ మిర్రర్లు ఉంటాయి. ఈ కారు 6.75 లీటర్ V8 ఇంజన్ గరిష్టంగా 499 bhp అవుట్‌పుట్ ఉంటుంది. అలాగే 1020 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది