Bleeding eye Virus: కరోనా వచ్చి ప్రపంచ వ్యాప్తంగా అందరిని భయపెట్టిన సంగతి తెలిసిందే. కోవిడ్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా కంటే ప్రమాదకరమైన ఓ వైరస్ ఇప్పుడు ఆఫ్రికన్ ప్రజలను భయపెట్టిస్తోంది. ఆఫికన్ దేశమైన రువాండాలో ప్రస్తుతం ఓ కొత్త వైరస్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఈ వైరస్ సోకి ఇప్పటికే 15 మందికి పైగా మరణించారు. ఇంకా చాలామందికి కూడా ఈ వైరస్ సోకి ఉంటుంది. దీనివల్ల ఇంకా ప్రమాదం పెరిగే అవకాశం ఉందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇంతకీ ఈ వైరస్ ఏంటి? దీని లక్షణాలు ఏంటి? దీనికి చికిత్స ఏంటి? పూర్తి వివరాలు స్టోరీలో చూద్దాం.
ఆఫ్రికన్ దేశమైన రువాండాను మార్బర్గ్ వైరస్ చుట్టుముట్టింది. దీన్ని బ్లీడింగ్ ఐ వైరస్ అని కూడా అంటారు. ఈ వైరస్ సోకిన వారికి కళ్ల నుంచి రక్తం కారుతుంది. మొదటిసారిగా ఈ వైరస్‌ను 1961లో జర్మనీలో గుర్తించారు. ఈ వైరస్ అనేది చాలా ప్రమాదకరమైనది. ఇది ఎబోలా ఫ్యామిలీకి చెందిన వైరస్. ఇది సోకి తర్వాత మొదటిగా హెమరేజిక్ ఫీవర్ వస్తుంది. ఆ తర్వాత రక్త నాళాలను దెబ్బతీసి కళ్లలో రక్తం రావడానికి కారణం అవుతుంది. మొదటిసారిగా ఈ వైరస్ గబ్బిలాల నుంచి సోకుతుంది. ఆ తర్వాత మనుషులకు అంటుకుంటుంది. మనుషుల్లో ఒకరి నుంచి ఒకరికి యూరిన్, లాలా జలం, రక్తం ద్వారా కూడా ఈ వైరస్ సోకుతుంది. అలాగే లైంగిక చర్యల ద్వారా కూడా ఈ వైరస్ సోకుతుంది. ఈ ప్రమాదకరమైన వైరస్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ బ్లీడింగ్ ఐ వైరస్ సోకిన వారిలో కొన్ని లక్షణాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. దీని లక్షణాలు కూడా ఎబోలా వైరస్‌లానే ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారిలో ఫస్ట్ జ్వరం వస్తుంది. ఆ తర్వాత అది తీవ్రంగా మారి తలనొప్పి, కండరాలు నొప్పి, వాంతులు రావడం, శరీరంపై దద్దుర్లు వంటివి ఏర్పడతాయి. ఆ తర్వాత ఈ వైరస్ అధికంగా అయ్యి ఒక్కసారిగా బరువు తగ్గిపోతారు. ఆ తర్వాత ముక్కు, కళ్లు, నోటి నుంచి రక్తం వస్తుంది. మహిళలకు అయితే పీరియడ్స్ కాకపోయిన యోని నుంచి రక్తస్రావం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకితే తొందరగా మరణిస్తారు. బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం దీనికి ఎలాంటి చికిత్సలు కూడా అందుబాటులో లేవు. దీనికి వ్యాక్సిన్ కూడా ఇంకా తయారు చేస్తున్నారు. అది ప్రాథమిక దశలోనే ఉంది. అయితే లక్షణాలను బట్టే వైద్యులు చికిత్స చేస్తారు. ఈ వైరస్ సోకిన వారు అందరికీ చాలా దూరంగా ఉండాలి. ఒకరిని ఒకరు తాకడం వల్ల కూడా వైరస్ సోకుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ వైరస్ సోకిన వారు దూరంగా ఉంటూ వైద్యులు తెలిపిన సూచనలు పాటించాలి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.