Income growth tips: ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం ఈజీ కావచ్చు. కానీ సంపాదించిన డబ్బును మిగిల్చుకోవడం ఎంతో కష్టంగా మారింది. ఎందుకంటే వచ్చే ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో సేవింగ్ చేయడానికి చాలామంది తర్జనభర్జన పడుతున్నారు. అయితే ఆదాయం ఎక్కువగా లేనప్పుడు కొన్ని ఖర్చులను తగ్గించుకోవడమే ఉత్తమం. ముఖ్యమైన అవసరాలు ఎలాగో తప్పవు. కానీ కొన్ని అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు వాటిపై మిగిలే డబ్బును సేవింగ్స్ కు మళ్ళించడం వల్ల ఆర్థికంగా లాభపడతారు. అసలు ఎలాంటి ఖర్చులను తగ్గించుకోవాలి? సేవింగ్స్ చేయడానికి ఎలాంటి ప్రణాళికలు వేయాలి? ఆ వివరాల్లోకి వెళితే..
సేవింగ్స్:
వచ్చే ఆదాయంలో 20% వరకు సేవింగ్స్ కోసం కేటాయించాలి. అయితే అనుకోని ఖర్చులు వస్తే ఎమర్జెన్సీ ఫండ్ ను కేటాయించాలి. సేవింగ్స్ తప్పిదం వల్ల భవిష్యత్తులో పెద్ద అవసరాలకు కష్టంగా మారుతుంది. అందువల్ల ప్రత్యేకంగా సేవింగ్స్ కోసం ఎంతో కొంత ఏర్పాటు చేసుకోవాలి.
ఆఫర్లు:
ఒక్కోసారి కొన్ని వస్తువుల పై ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. దీంతో చాలామంది ఆ వస్తువుల అవసరం లేకున్నా కూడా కొనుగోలు చేస్తారు. వాటిపై విచ్చిన డబ్బు ఇతర అవసరాలకు ఉపయోగపడకుండా పోతుంది. అంతేకాకుండా అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఆ వస్తువులు పాడైపోతాయి. అందువల్ల ఆఫర్ మాయలో పడి డబ్బులు వృధా చేసుకోవద్దు.
ఖర్చులు:
ఒక నెలలో లేదా కొన్ని రోజుల్లో ఎంత ఖర్చు పెట్టాలి అన్న దానిని ముందే నిర్ణయించుకోవాలి. ఒక బడ్జెట్ రూపొందించుకొని అందులోనే ఖర్చు చేయడం వల్ల సేవింగ్స్ పెరుగుతాయి. అలా కాకుండా క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించడం వల్ల అదుపు లేకుండా ఖర్చులు ఉంటాయి.
కూపన్ ఫుడ్:
ఉద్యోగాలు చేసే వారికి కొన్ని సంస్థలు ఫుడ్ కోసం ప్రత్యేకంగా కూపన్లు ఇస్తుంటారు. ఇలా కూపన్లు ఇచ్చినప్పుడు వాటిని మనీగా మార్చుకొని డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. వీటి ప్లేస్ లో ఇంట్లో వండిన ఆహారం తినడం వల్ల ఆరోగ్యంతో పాటు డబ్బులు మిగులుతాయి. నేటి కాలంలో బయట దొరికే ఆహారం కలుషితంగా మారింది. అందువల్ల ఈ కూపన్ ఫుడ్ జోలికి పోకుండా ఉండడమే మంచిది.
వెయిట్ చేయడం:
ఒక వస్తువు కొనుగోలు చేయాలని అనుకుంటే కొంత సమయం తీసుకోవాలి. ఎందుకంటే ఆ తర్వాత మరో వస్తువు కొనాల్సి వస్తుంది. ఇలా కొన్ని వస్తువులు ఒకేచోట.. ఒకేసారి కొనడం వల్ల ఖర్చుల విలువ తెలుస్తుంది. అన్ని ఒకేసారి.. ఒకే చోట కొనడం వల్ల డిస్కౌంట్ కూడా వచ్చే అవకాశాలున్నాయి.
సౌకర్యాలు:
కొందరు రవాణా కోసం రకరకాల వాహనాలు కొనుగోలు చేస్తారు. తమ ప్రయాణాలకు ఇబ్బంది ఉండకూడదని భావిస్తారు. కానీ ఇలా ప్రత్యేక వాహనాల్లో వెళ్లే కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించడం వల్ల ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. పొదుపు చేయాలి అని అనుకునేవారు ఇలా ఖర్చులను తగ్గించుకోవచ్చు.
వస్తువుల రిపేర్:
ఒక వస్తువు పాడైతే వాటి ప్లేస్ లో కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కానీ అలా కొత్త వస్తువులు కొనుగోలు చేయకుండా వాటిని రిపేర్ చేయడం లేదా రిపేర్ చేయించడం నేర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల కొంతవరకు డబ్బు మిగిలే అవకాశం ఉంటుంది.