https://oktelugu.com/

Garlic Water: చలికాలంలో టీ బదులు వెల్లుల్లి నీరు తాగితే ఏన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

Garlic Water: సాధారణంగా శీతాకాలం మొదలవగానే వాతావరణంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోతాయి ఈ క్రమంలో చల్లని వాతావరణం ఉండటం వల్ల చాలా మంది వేడి వేడి చాయ్ తాగాలని భావిస్తారు. ఈ క్రమంలోనే చాలా మంది రోజుకు ఎక్కువ సార్లు టీ తాగుతూ ఉంటారు. అయితే చలికాలంలో టీ బదులుగా వెల్లుల్లి నీళ్లు తాగటం వల్ల శరీరానికి మంచి ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు దరి చేరనీయకుండా కాపాడుతుంది. టీ బదులు ప్రతి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 6, 2022 / 04:26 PM IST
    Follow us on

    Garlic Water: సాధారణంగా శీతాకాలం మొదలవగానే వాతావరణంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోతాయి ఈ క్రమంలో చల్లని వాతావరణం ఉండటం వల్ల చాలా మంది వేడి వేడి చాయ్ తాగాలని భావిస్తారు. ఈ క్రమంలోనే చాలా మంది రోజుకు ఎక్కువ సార్లు టీ తాగుతూ ఉంటారు. అయితే చలికాలంలో టీ బదులుగా వెల్లుల్లి నీళ్లు తాగటం వల్ల శరీరానికి మంచి ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు దరి చేరనీయకుండా కాపాడుతుంది.

    టీ బదులు ప్రతి రోజు వెల్లుల్లి నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. మరి ఈ వెల్లుల్లి నీళ్లు ఎలా తయారు చేయాలి అనే విషయానికి వస్తే….మూడు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వాటిని బాగా చితక్కొట్టి ఒక గ్లాస్ నీటిని వేసి మరగ బెట్టాలి. ఇలా బాగా మరిగించిన వెల్లుల్లి నీటిని ఉదయమే అల్పాహారానికి ముందు లేదా ఆ తర్వాత తాగిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అనే విషయానికి వస్తే…

    * సాధారణంగా చలికాలంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతాయి. ఈ క్రమంలోనే అనారోగ్య సమస్యలతో పోరాడటానికి మన శరీరంలోని రోగ నిరోధక శక్తి అవసరం అవుతుంది కనుక మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందింప చేస్తాయి

    * శరీర బరువు తగ్గాలనుకొనే వారు ప్రతిరోజు ఈ వెల్లుల్లి నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి శరీరం బరువు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.అదేవిధంగా డయాబెటిస్ సమస్యతో బాధపడేవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచడానికి ఈ నీళ్లు ఎంతో ఉపయోగపడతాయి.

    *వెల్లుల్లిలో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఈ విధమైనటువంటి గుండె సంబంధిత సమస్యలను దరిచేరనీయకుండా కాపాడుతుంది. అలాగే మన శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాల నుంచి మనల్ని రక్షిస్తుంది.

    *ముఖ్యంగా కీళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ ఉదయం ఈ వెల్లుల్లి నీటిని తాగడం వల్ల కీళ్ల నొప్పులు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.