https://oktelugu.com/

Kitchen Tips: గ్యాస్ తొందరగా అయిపోయిందని బాధపడుతున్నారా.. ఈ చిట్కాలు పాటించి గ్యాస్ ఆదా చేయండి!

Kitchen Tips: ప్రస్తుత కాలంలో గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి రావడం వల్ల చాలామంది పొయ్యి పై వంట చేయడం మానేశారు.ఈ క్రమంలోనే ప్రతి ఒక్క ఇంటిలో మనకు గ్యాస్ కనపడుతుంది.ఇలా గ్యాస్ పై వంట చేయడం వల్ల త్వరగా వంట అవుతుంది అలాగే ఏమాత్రం కష్టపడాల్సిన పని ఉండదు. కానీ కొందరి ఇళ్ళల్లో గ్యాస్ నెల కూడా రాదు. రోజురోజుకు గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతూ ఉంటే ఇలా నెలకొక గ్యాస్ సిలిండర్ ఖాళీ అవుతున్న క్రమంలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 6, 2022 / 04:23 PM IST
    Follow us on

    Kitchen Tips: ప్రస్తుత కాలంలో గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి రావడం వల్ల చాలామంది పొయ్యి పై వంట చేయడం మానేశారు.ఈ క్రమంలోనే ప్రతి ఒక్క ఇంటిలో మనకు గ్యాస్ కనపడుతుంది.ఇలా గ్యాస్ పై వంట చేయడం వల్ల త్వరగా వంట అవుతుంది అలాగే ఏమాత్రం కష్టపడాల్సిన పని ఉండదు. కానీ కొందరి ఇళ్ళల్లో గ్యాస్ నెల కూడా రాదు. రోజురోజుకు గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతూ ఉంటే ఇలా నెలకొక గ్యాస్ సిలిండర్ ఖాళీ అవుతున్న క్రమంలో సాధారణ ప్రజలకు ఇది అధిక భారం అవుతుంది. ఈ క్రమంలోనే గ్యాస్ త్వరగా అయిపోకుండా ఎక్కువ రోజులపాటు రావాలంటే ఈ సింపుల్ చిట్కాలను పాటించాల్సిందే…

    గ్యాస్ ఎక్కువ రోజులపాటు రావాలంటే ముందుగా మనం గ్యాస్ పై చేసే ఎలాంటి కూరలు అయినా వాటిలో కి వేసే పప్పు దినుసులను అరగంట ముందు నానబెట్టి కూర చేయడం వల్ల తొందరగా కూర పూర్తి అవుతుంది లేదంటే ఆ పప్పుదినుసులు ఉండకడం కోసం ఎక్కువగా గ్యాస్ వృధా అవుతుంది.అలాగే మనం ఏదైనా వంట చేస్తున్నాము అని భావిస్తే ముందుగా ఆ వంటకు కావలసిన వంట దినుసులన్నీ సమకూర్చుకోవాలి. ఇలా సమకూర్చుకున్నప్పుడే గ్యాస్ ఆదా చేయగలము.

    చాలామంది వంట వండుతున్న సమయంలో ఆ కూర లో నీళ్లు తక్కువగా ఉన్నాయని పదేపదే నీళ్ళు పోస్తూ ఉంటారు.ఇలా నీళ్లు పోయడం వల్ల మరి ఆ నీళ్ళు వేడి అయ్యి కూర ఉడికేలోపు ఎక్కువ సమయం అవుతుంది ఈ క్రమంలోనే గ్యాస్ కూడా వృధా అవుతుంది. అదేవిధంగా చాలామంది గ్యాస్ పై ఏదైనా కూరలు చేసేటప్పుడు కూర పొంగిపోతుంది, స్టవ్ శుభ్రం చేసుకోవాలని భావిస్తూ కూరల పై మూత పెట్టరు. ఇలా మూత పెట్టకపోవడం వల్ల కూర ఉడకడానికి ఆలస్యం అవుతుంది ఆ సమయంలోనే గ్యాస్ వృధా అవుతుంది. అందుకే మూతపెట్టి ఉడికించడం వల్ల కూడా తొందరగా ఉడికి గ్యాస్ ఆదా అవుతుంది.

    చాలా మంది చేసే అతి పెద్ద తప్పు ఏమిటి అంటే త్వరగా కూర ఉడకాలి అని భావించి పెద్ద మంట పెట్టి కూరలు చేస్తుంటారు. అలా పెద్దగా మంట పెట్టడం వల్ల గ్యాస్ గిన్నె పై భాగానికి వెళుతుంది తప్ప కూడా తొందరగా కాదు. అందుకోసమే సిమ్ లో పెట్టుకొని కూర చేయడం వల్ల గ్యాస్ ఆదా అవుతుంది. ఈ చిట్కాలను పాటిస్తే గ్యాస్ సిలిండర్ వెంటనే అయిపోకుండా మరికొన్ని రోజులపాటు రావడానికి ఆస్కారం ఉంటుంది.