Ash immersion rituals: పుట్టిన ప్రతి వ్యక్తి మరణించకుండా ఉండరు. ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఎంతో సంతోషం ఉంటుంది. కానీ మరణించినప్పుడు దుఃఖం మిగులుతుంది. అయితే పుట్టుక, మరణం మధ్య ఎలాంటి జీవితం గడిపినప్పటికీ మరణించేటప్పుడు దేహం మాత్రమే మిగులుతుంది. అయితే ఈ దేహం కూడా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే ఆ దేహాన్ని ఖననం లేదా దహనం చేస్తారు. ఖననం అంటే పూడ్చిపెట్టడం.. దహనం అంటే దేహాన్ని కట్టెలతో కాల్చివేయడం. ఒక మృతదేహాన్ని కాల్చి వేసిన తర్వాత అస్థికలు అలాగే ఉండిపోతాయి. భారతదేశ సంప్రదాయం ప్రకారం అస్థికలను నదిలో కలపాలని భావిస్తారు. అయితే ఈ అస్థికలు ఏ నదిలో కలపాలి? ఎందుకు కలపాలి?
భారతదేశ సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వ్యక్తి అస్థికలను నదిలో కలుపుతారు. ఇది పురాతన నుంచి వస్తున్న సాంప్రదాయం. చనిపోయిన వ్యక్తి అస్థికలను నదిలో ఎందుకు కలపాలి? అన్న సందేహం చాలామందికి వస్తుంది. అయితే ఇందుకు ఒక పురాణ కథ ఉంది. భగీరథుడు తన పితృవంశం ఆత్మల కు మోక్షం కలిగించాలని ఉద్దేశంతో తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు గంగాదేవి భూమిపైకి వస్తుంది. ఈ గంగా నదిలో భగీరథుడు తన పితృదేవతల అస్థికలను కలపగా వారికి మోక్షం లభిస్తుంది. అప్పటినుంచి ఈ ఆచారం మొదలైంది. దీనినే ‘ పితృమోక్షదాయిని’.. అని అంటారు. దహనం తర్వాత మిగిలిన అస్థికలను గోమయం, పాలు, గంగాజలంతో శుభ్రం చేసి ఒక పాత్రలో ఉంచాలి. వాటిని కుటుంబ పెద్దలు లేదా కుమారులు నదికి తీసుకెళ్తారు. అది తీరంలో పితృతర్పణం చేయించి.. మంత్రోచ్ఛారణల మధ్య అస్థికలను కలుపుతారు.
మరణించిన వారి అస్థికలను దగ్గరిలో ఉన్న నదిలో కలపవచ్చు. అయితే గంగా నది, యమునా, గోదావరి, నర్మదా, కృష్ణ, కావేరి నదుల్లో కలపడం వల్ల శ్రేష్టమని భావిస్తారు. గంగా నది అత్యున్నత స్థానం హరిద్వార్లో ఉంటుంది. అలాగే వారణాసి, గయా ప్రాంతాల్లో కూడా గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. మిగతా నదులు ఆయా జిల్లాల్లో ప్రవహిస్తూ ఉంటాయి.
అస్థికలను నదుల్లో కలపడం వల్ల మరణించిన వారి ఆత్మకు మోక్షం కలుగుతుందని భావిస్తారు. పితృదేవతలు దేవలోకానికి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే మరణించిన వారి పితృ తర్పణాలు చేసి అస్థికలు కలపడం వల్ల వారి ఆశీర్వాదం ఉంటుందని.. అలాగే ఇంట్లో శాంతి నెలకొంటుందని అంటుంటారు. అలాగే మన శరీరం నీటిలో కలిసిపోతే.. ఆత్మ ఆకాశానికి వెళుతుందని భావిస్తారు. అయితే చాలామంది అస్థికలను కలపడం శుభకార్యంగా కాకుండా.. భయంతో చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా మరణించిన వారి అస్థికలు గదిలో కలపడం వల్ల ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందని భావిస్తారు.