Vastu Remedies: సంతోషకరమైన జీవితం గడపాలా.. అయితే ఈ వాస్తు టిప్స్ పాటించాల్సిందే..?

Vastu Remedies: మనం సుఖంగా సంతోషంగా జీవించాలన్న తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు వారి జీవితం సంతోషంగా సుఖంగా సాగిపోవాలని కొన్ని రకాల టిప్స్ పాటిస్తూ ఉంటారు.   ఇలా వాస్తు పరిహారాలను పాటించడం వల్ల మన జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి ఏ విధమైనటువంటి వాస్తు చిట్కాలను పాటించడం వల్ల మన జీవితం సంతోషంగా సాగిపోతుంది అనే విషయానికి వస్తే.. మన ఇంటికి అదృష్టం వచ్చి […]

Written By: Kusuma Aggunna, Updated On : December 20, 2021 11:04 am
Follow us on

Vastu Remedies: మనం సుఖంగా సంతోషంగా జీవించాలన్న తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు వారి జీవితం సంతోషంగా సుఖంగా సాగిపోవాలని కొన్ని రకాల టిప్స్ పాటిస్తూ ఉంటారు.

 

ఇలా వాస్తు పరిహారాలను పాటించడం వల్ల మన జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి ఏ విధమైనటువంటి వాస్తు చిట్కాలను పాటించడం వల్ల మన జీవితం సంతోషంగా సాగిపోతుంది అనే విషయానికి వస్తే..

Vastu Remedies

మన ఇంటికి అదృష్టం వచ్చి ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉండాలంటే ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం పట్ల ఎంతో శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంటేనే ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా ఉంటాయి. అందుకోసమే ఇంటి ప్రధాన ద్వారానికి పరిశుభ్రంగా ఉంచే ప్రధాన ద్వారం ఇరువైపులా స్వస్తిక్ చిహ్నం వేయాలి. ఈ విధమైనటువంటి స్వస్తిక్ చిహ్నం ఉండటం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అలాగే ఇంటిలో పూజ గది కూడా ఎంతో ముఖ్యమైనది.

Also Read: Omicron: ఒమిక్రాన్ పై ఏపీ సర్కార్ అలర్ట్.. రేపటి నుంచి ఇంటింటి సర్వేకు రెడీ

మన ఇంట్లో పూజగది ఎల్లప్పుడు ఉత్తరం వైపున, తూర్పువైపున ప్రార్థనా మందిరం మొఖం ఉండేలా చూసుకోవాలి. అలాగే పొరపాటున కూడా చనిపోయిన వారి ఫోటోలను పూజగదిలో ఉంచకూడదు. చాలామంది మెట్ల కింద భాగంలో లేదా ఇంటిని దూలాలతో నిర్మించినప్పుడు వాటి కింద నిద్రపోతూ ఉంటారు. ఇలా నిద్ర పోతున్న ఇంటికి దరిద్రం. అలాగే విరిగిపోయిన పాత వస్తువులను ఇంటిలో ఉంచుకోకుండా జాగ్రత్తపడాలి ఇక ఇంటి ఆవరణంలో మొక్కలు విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. పాలు కారే చెట్లు, ముల్లు కలిగినటువంటి చెట్లను ఇంటి ఆవరణంలో పెట్టుకోకూడదు. ఈ విధమైనటువంటి వాస్తు టిప్స్ పాటించడం వల్ల మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండి కుటుంబ సభ్యులు మొత్తం సుఖ సంతోషాలతో గడుపుతారు.

Also Read: Devotional: పూజలు, వ్రతాలు చేసేవారు ఉల్లిపాయ వెల్లుల్లి ఎందుకు తినకూడదో తెలుసా?