Jabardasth Comedy Show: బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో జబర్ధస్త్ కార్యక్రమం గురించి తెలియని వారుండరు. ఈ షో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనసూయ, రష్మి గౌతమ్ ఈషో తోనే యాంకర్లుగా లైమ్ లైట్‌లోకి వచ్చారు. ఎంతో మంది ఈ షోతో కమెడీయన్స్ గా మంచి పొజిషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం సినిమా అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటున్నారు. ఎంతో మంది కమెడియన్స్, జడ్జీలు వచ్చి వెళ్లారు. కానీ షో మాత్రం ఆగిపోకుండా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ కీలక అప్‌డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడు జబర్దస్త్ షోలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.

ఇప్పటికే పలువురు టీమ్ లీడర్లు, ఇతర కమెడియన్స్ షోను విడిచి వెళ్లగా, తాజాగా మరో ఇద్దరు గుడ్‌బై చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. అదిరే అభి జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే మా టీవీలో నాగబాబు, శ్రీదేవి జడ్జిలుగా ఉన్న కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్‌కు వెళ్లిపోయారు. అతడితో పాటు మరో టీమ్ లీడర్‌గా పని చేసిన జిగేల్ జీవన్ కూడా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
Also Read: డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన జబర్దస్త్ ఇమ్మానుయెల్ – వర్ష…
అయితే కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఫోటోను అదిరే అభి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో వీరిద్దరు జబర్దస్త్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల జబర్దస్త్ ను వీడుతున్న కామెడీయన్ల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. తాజాగా ఇద్దరు టీం లీడర్లు ఏకంగా జబర్దస్త్‌ను వీడటం చర్చనీయాంశంగా మారింది. ఈ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అదిరే అభి, జిగేల్ జీవన్ తాజాగా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పడం షాక్‌కు గురి చేస్తోంది.
Also Read: సుధీర్ స్థానంలో బిగ్ బాస్ అఖిల్.. అసలు మల్లెమాలలో ఏం జరుగుతుంది?