https://oktelugu.com/

Chandrababu: అభ్యర్థుల కోసం చంద్రబాబు వెతుకులాట

Chandrababu: తెలుగుదేశం పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. పార్టీని నమ్ముకున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అందరు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పార్టీకి నేతలు కరువవుుతన్నారు. పార్టీకి భవిష్యత్ లేదనే బెంగతోనే పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. అధినేత చంద్రబాబు నిర్వాకంతోనే ఇలా జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు నాయకత్వంపై అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో రాష్ర్టంలో టీడీపీకి ఇక కాలం చెల్లినట్లే అనే సంశయాలు అందరిల వ్యక్తమవుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో సర్వం […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 20, 2021 / 10:18 AM IST
    Follow us on

    Chandrababu: తెలుగుదేశం పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. పార్టీని నమ్ముకున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అందరు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పార్టీకి నేతలు కరువవుుతన్నారు. పార్టీకి భవిష్యత్ లేదనే బెంగతోనే పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. అధినేత చంద్రబాబు నిర్వాకంతోనే ఇలా జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు నాయకత్వంపై అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో రాష్ర్టంలో టీడీపీకి ఇక కాలం చెల్లినట్లే అనే సంశయాలు అందరిల వ్యక్తమవుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

    Chandrababu

    గత ఎన్నికల్లో సర్వం ఊడ్చి పెట్టినా ఫలితం రాలేదు. దీంతో ఇక తమ వద్ద ఏమి లేదని చెబుతుున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆదుకుంటేనే వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమని చెబుతున్నారు. పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల కొరత వేధిస్తోంది. దీంతో ఎన్నికల్లో ఎలా గెలిచేదనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బాబు కూడా ఏ మేరకు పార్టీని నడిపిస్తారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

    గతంలో పోటీ చేసిన వారు సైతం ఇప్పుడు పోటీకి సిద్ధంగా లేరని తెలుస్తోంది. గతంలో పెట్టిన ఖర్చుతో తీవ్రంగా నష్టపోయినట్లు భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఆదుకుంటేనే పోటీలో ఉంటామని లేదంటే వేరే పార్టీని వెతుక్కుంటామని బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో చంద్రబాబు అభ్యర్థులను ఏ మేరకు మచ్చిక చేసుకుని పార్టీని నడిపిస్తారో తెలియడం లేదు.

    Also Read: Niti Aayog: ఏపీకి ఊహించని రిప్లై ఇచ్చిన నీతి అయోగ్..

    ఇప్పటివరకు చాలా మంది పార్టీని వీడి వలసలు వెళ్లారు. ఉన్న వారిని కాపాడుకునేందుకు కూడా బాబు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో బాబు ఏం తేల్చుకోలేకపోతున్నారు. అభ్యర్థుల వ్యయం పెరిగిపోతున్న సందర్భంలో వారిని ఎలా పోటీలో నిలుపుతారో కూడా అంతుచిక్కడం లేదు. దీంతో రాబోయే ఎన్నికల్లో బాబుకు పార్లమెంట్ అభ్యర్థుల కొరత కొరకరాని కొయ్యగా మారే అవకాశం ఏర్పడింది.

    Also Read: Minister Balineni: సొంత పార్టీ మంత్రి బాలినేని అనుచరుడిపై వైసీపీ నేతల దాడి.. అసలేమైదంటే?

    Tags