Medicine: ప్రస్తుత కాలంలో డబ్బులు ఆసరాగా చేసుకుని ఎంతో మంది నకిలీ మందులను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి నకిలీ మందులకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. ఇకపై మార్కెట్లోకి వచ్చే మందులు మంచివా లేదా నకిలీవా అని కనుక్కోవడం కోసం ఔషధాల తయారీలో ఉపయోగించే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ)పై క్యూఆర్ కోడ్‌లను పెట్టడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
Also Read: కరోనా మందులు ఎలా వాడాలో తెలుసా.. వాటి వల్ల కలిగే దుష్పరిమాణాలివే?
దీని ద్వారా ఎంతో సులభంగా మనం నకిలీ మందులను కనుగొనవచ్చు. QR అంటే క్విక్ రెస్పాన్స్ ఈ కోర్టు ద్వారా మనం బార్కోడ్ స్కాన్ చేస్తే వెంటనే ఆ మందు సరైనదా లేదా అనే విషయం సెకండ్లలో తెలిసిపోతుంది. అయితే ఈ నిబంధనలను ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరి 2023 నుంచి అమలులోకి తీసుకురానుంది. ఈ క్రమంలోనే
ఏపీఐలో క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.ఈ క్రమంలోనే ఆమె అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకోవాలంటే క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు వాటి ధర ఏంటి అన్న పూర్తి విషయాలు తెలిసిపోతాయి.
ఈ క్రమంలోనే మనం నకిలీ మందులను తొందరగా గుర్తించవచ్చు. డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (DTAB) జూన్ 2019లో ఈ ప్రతిపాదనను ఆమోదించింది.ఒక నివేదిక ప్రకారం దేశంలో సుమారు మూడు శాతం వరకు నాణ్యత లేని మందులు సరఫరా అవుతున్నాయని తెలియడంతో ఇలాంటి నాణ్యతలేని మందులను అరికట్టడం కోసం ఈ క్యూఆర్ కోడ్ స్కానింగ్ అమలులోకి తీసుకురానున్నారు ద్వారా నకిలీ మందులను అరికట్టవచ్చు.
Also Read: పారాసెటమాల్ ట్యాబ్లెట్లను ఎక్కువగా వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్!