Unstoppable with NBK: ‘బాలయ్య – మహేష్’ ఎపిసోడ్ ఫుల్ డిటైల్స్ ఇవే !

Unstoppable with NBK:  బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షో ‘ఆహా’లోనే రికార్డ్ స్థాయిలో హిట్ అయింది. ఇప్పుడు ఆ షోకి మహేష్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఆల్ రెడీ మహేష్ తో ఆ ఎపిసోడ్ ను షూట్ చేశారు. అయితే, తాజాగా అది ఎప్పుడు స్ట్రీమ్ కానుందో క్లారిటీ వచ్చింది. అన్‌స్టాపబుబ్ సీజన్ ముగింపు వేడుకగా ఈ ఎపిసోడ్‌ను ఫిబ్రవరి 4న ప్రసారం చేయనున్నట్లు ‘ఆహా’ నిర్వాహకులు తెలిపారు. దీంతో బాలయ్య- మహేష్ కాంబోను చూసేందుకు […]

Written By: Shiva, Updated On : January 21, 2022 10:25 am
Follow us on

Unstoppable with NBK:  బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షో ‘ఆహా’లోనే రికార్డ్ స్థాయిలో హిట్ అయింది. ఇప్పుడు ఆ షోకి మహేష్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఆల్ రెడీ మహేష్ తో ఆ ఎపిసోడ్ ను షూట్ చేశారు. అయితే, తాజాగా అది ఎప్పుడు స్ట్రీమ్ కానుందో క్లారిటీ వచ్చింది. అన్‌స్టాపబుబ్ సీజన్ ముగింపు వేడుకగా ఈ ఎపిసోడ్‌ను ఫిబ్రవరి 4న ప్రసారం చేయనున్నట్లు ‘ఆహా’ నిర్వాహకులు తెలిపారు. దీంతో బాలయ్య- మహేష్ కాంబోను చూసేందుకు రెండు కళ్లు చాలవని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Unstoppable with NBK

ఇక ఈ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. పైగా అదే చివరి ఎపిసోడ్ అని గత కొన్ని రోజులుగా ఇదే హాట్ టాపిక్ అయింది. అయితే, అదే నిజం అని ఆహా సంస్థ కూడా క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ ఎపిసోడ్ లో మహేష్ మనసు విప్పి మాట్లాడాడు అట. అలాగే మహేష్ గతంలో ‘బసవతారకం క్యాన్సర్ ఫౌండేషన్ కి కొంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడని.. ఆ విషయాన్ని బాలయ్య ప్రస్తావించారని తెలుస్తోంది.

Also Read:  ఒపినీయన్ పోల్: ఉత్తరప్రదేశ్ లో  అధికారం ఎవరిదంటే? 

ఆ సమయంలో బాలయ్యతో మహేష్ తన సేవా కార్యక్రమాల గురించి ప్రముఖంగా మహేష్ ప్రస్తావించారట. తెలుగు రాష్ట్రాల్లోని బుర్రిపాలెం, మరియు సిద్దాపురం అనే రెండు గ్రామాలను తానూ దత్తత తీసుకున్నట్లు, ఆ గ్రామాల్లో తాను ఎలాంటి సేవా కార్యక్రమాలను చేపట్టాడు లాంటి విషయాలను కూడా మహేష్ ఈ ఎపిసోడ్ లో చెప్పారట. మరి ఈ ప్రత్యేక ఎపిసోడ్ కి భారీ స్థాయిలో వ్యూస్ వస్తాయని ఆహా టీమ్ నమ్మకంగా ఉంది.

ఎపిసోడ్ మొత్తంలో మహేష్ – బాలయ్య మధ్య జరిగిన సంభాషణలు ఇరువురు హీరోల ఫ్యాన్స్‌ కి ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంటాయట. ప్రస్తుత తెలుగు వెండితెర పై టాప్ హీరోలుగా రాణిస్తోన్న ఈ ఇద్దరూ… బుల్లితెరపై కూడా స్క్రీన్ స్పేస్ తో పాటు ఎమోషన్స్ ను, ఎక్స్ ప్రెషన్స్ ను కూడా షేర్ చేసుకోవడం ఆసక్తిగా ఉంటుంది.

ఏది ఏమైనా ఎప్పుడూ గంభీరంగా ఉండే బాలయ్య హోస్ట్ గా చేయడం, పైగా ఆ షో సూపర్ హిట్ అవ్వడం.. మొత్తమ్మీద బాలయ్య అంటే ఏమిటో అందరికీ అర్థం అయింది. ఆయన హోస్ట్ గా బాగా సక్సెస్ అయ్యారు.

Also Read:  లిల్లీ ఫ్లవర్ సాగుతో లక్షల్లో సంపాదించే అవకాశం.. ఎలా అంటే?

Tags