Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన నీతి గ్రంథం ద్వారా నేటి తరం యువతకు ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన విషయాలను తన నీతి గ్రంథం ద్వారా తెలియజేశారు. ఒక మనిషి తన జీవితంలో విజయాలను సాధించాలన్న, ఒక వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించాలన్న, జీవితంలో ఎలాంటి వారిని నమ్మాలి ఎవరిని దూరం పెట్టాలి అనే విషయాలను ఎంతో అద్భుతంగా వివరించారు.ఈ క్రమంలోనే మనం నూతనంగా ఏదైనా పనులను ప్రారంభించిన వ్యాపారాలు చేపట్టిన ఆ వ్యాపారంలో అభివృద్ధి సాధించాలంటే ఎలాంటి సూత్రాలు పాటించాలి అనే విషయాల గురించి చాణిక్యుడు ఎంతో అద్భుతంగా వివరించారు. మరి ఆ విషయాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
Also Read: Union Budget Of India 2022: నదుల అనుసంధానానికి కేంద్రం అడుగులు.. తెలుగు రాష్ట్రాలపై ప్రభావం..
ఏ వ్యక్తి అయినా ఒక కొత్త పని ప్రారంభించేటప్పుడు ముందుగా తనలో అనుకూల ఆలోచనలను కలిగి ఉండాలి. ఇలాంటి పాజిటివ్ ఆలోచన ఉన్నప్పుడే మనం పనిలో విజయం సాధిస్తాం. ఎప్పుడైతే మనలో ప్రతికూల ఆలోచన వస్తుందో మనం మన పనిలో ముందుకు వెళ్ళలేము.ఆ పనిని ప్రారంభించే ముందు మనం దీనిని చేయగలమా అంత సామర్థ్యం మనలో ఉందా అని ఒకసారి ప్రశ్నించుకోవాలి.అలా ప్రశ్నించుకున్న తర్వాత ఆ పని చేయగలమని నమ్మకం ఉంటేనే ప్రారంభించాలి లేదంటే మరొక ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాలి.
ఏదైనా ఒక కొత్త పని ప్రారంభించేటప్పుడు మన ప్రసంగం మన నియంత్రణలో ఉండాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక పోతే మనం ఎలాంటి పనులను చేయాలి అనుకున్నాము ఏంటి అనే విషయాలను ఎప్పుడూ మనలోనే ఉంచుకోవాలి. ఇలాంటి విషయాలను ఎవరి దగ్గర ప్రస్తావించ కూడదు. చాణిక్యుడు చెప్పిన విధానం ప్రకారం మనం విజయం సాధించాలంటే కొన్ని విషయాలలో కొందరి పట్ల అనిశ్చిత నిర్ణయాలు కూడా తీసుకోవలసి ఉంటుంది. రిస్క్ తీసుకుంటే తప్పక విజయం సాధిస్తామని చాణిక్యుడు వెల్లడించారు.
Also Read: Union Budget Of India 2022: అసలైన విషయాలపై కేంద్రానికి సోయిలేదు.. బడ్జెట్‌పై కేసీఆర్ ఫైర్..