Homeఎంటర్టైన్మెంట్Karthika Deepam February 1 Episode: ఈ సర్జరీ చేయడం నావల్ల కాదు అంటూ నిరాకరించిన...

Karthika Deepam February 1 Episode: ఈ సర్జరీ చేయడం నావల్ల కాదు అంటూ నిరాకరించిన డాక్టర్.. బాధను తట్టుకోలేకపోతున్న కార్తీక్, దీప!

Karthika Deepam February 1 Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. రుద్రాణి అంతు ఏంటో చూడాలి అని కార్తీక్ వెళ్లడంతో అక్కడ రుద్రాణి అప్పు ఇవ్వమని గట్టిగా అడుగుతుంది. ఇక కార్తీక్ ఆవేశంతో తనపై అరిచి అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉండగా రుద్రాణి తనకు పిల్లలు అంటే ఇష్టమని కావాలంటే నీ కూతురు ఆపరేషన్ కోసం డబ్బులు ఇస్తాను అని డబ్బులు ఇస్తుంది.

Karthika Deepam February 1 Episode
Karthika Deepam February 1 Episode

కానీ కార్తీక్ తీసుకోకుండా అక్కడినుంచి ఇంటికి వెళతాడు. అక్కడ అప్పును చూడగా అప్పు తనకు జరిగిన విషయం తెలిసిందని కార్తీక్ కు చెబుతాడు. వెంటనే కార్తీక్ అప్పు దగ్గర ఫోన్ తీసుకొని ఆదిత్య కు ఫోన్ చేస్తాడు. కానీ ఆ ఫోన్ మోనిత పాడు చేయటంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆ తర్వాత కాసేపటికి సౌర్యను హాస్పిటల్ కు తీసుకెళ్లగా అక్కడకు రుద్రాణి వస్తుంది.

Also Read: రవితేజకు కూడా రెండు డేట్లు ఎందుకయ్యా ?

అక్కడ కూడా వాళ్లని డబ్బులు తీసుకోమని దానికి బదులుగా హిమ ను ఇవ్వమని అనటంతో వెంటనే దీప రుద్రాణి తిట్టి పంపిస్తుంది. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్లిన కార్తీక్ డాక్టర్ మాటలకు అసహనాన్ని కోల్పోతాడు. మరోవైపు హిమ రుద్రాణి ఇంటికి వెళ్లి హిమ ను కాపాడండి ఆంటీ డబ్బులు ఇవ్వండి.. ఇకపై నేను ఇక్కడే ఉంటానని అనడంతో హిమను దగ్గరికి తీసుకొని ప్రేమ చూపిస్తుంది రుద్రాణి.

ఇక కారులో ఆదిత్య, శ్రావ్య ప్రయాణిస్తూ ఉంటారు. ఫోన్ పోయినందుకు ఆదిత్య బాధపడతాడు. అదే సమయంలో శ్రావ్య ఫోన్ కూడా పాడవడంతో ఇద్దరు బాధపడతారు. తరువాయి భాగంలో దీప రుద్రాణి ఇంటికి ఆవేశంగా వెళుతుంది. ఇక డాక్టర్..సౌర్య పరిస్థితి చూసి.. సర్జరీ చేయడం నావల్ల కాదు.. ఇది డాక్టర్ కార్తీక్ మాత్రమే చేస్తాడు అని అంటాడు. వెంటనే దీప నా కూతురు ప్రాణాలు కాపాడాల్సిన మీరే అంటూ డాక్టర్ బాబు కి చేతులెత్తి ఏడుస్తూ వేడుకుంటుంది.

Also Read: తెలుగు తెరకు రెండు తేదీలు అలవాటు చేసిన రాజమౌళి !

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version