https://oktelugu.com/

Mobile Phone: ఈ మూడు నెంబర్లు సేవ్ చేసుకుంటే మొబైల్ పోయినా దొరికిపోద్ది..

మొబైల్ దొంగిలించగానే చాలా మంది పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి కంప్లయింట్ ఇస్తారు. కానీ పోలీసులు మొబైల్ కు సంబంధించిన సమాచారం అడుగుతారు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 4, 2024 3:45 pm

    Mobile Phone

    Follow us on

    Mobile Phone: నేటి కాలంలో విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొందరు వస్తువులను దొంగిలించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విలువైన వస్తువుల్లో మొబైల్ ఒకటి. చేతిలో మొబైల్ లేకుండా దినం గడవని పరిస్థితి ఉంది. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి మొబైల్ మాయమవుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయలేం. అయితే ముందు జాగ్రత్తగా కొన్ని పనులు చేస్తే మొబైల్ ఎవరు దొంగిలించినా దానిని ఈజీగా దొరకపట్టొచ్చు. అపనులు ఏంటంటే?

    మొబైల్ దొంగిలించగానే చాలా మంది పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి కంప్లయింట్ ఇస్తారు. కానీ పోలీసులు మొబైల్ కు సంబంధించిన సమాచారం అడుగుతారు. ముఖ్యంగా మొబైల్ కు సంబంధించి ఈఎంఐ నెంబర్ తప్పనిసరిగా ఉండాలంటారు. మొబైల్ కొనుగోలు చేసినప్పుడు ఆ బాక్స్ పై ఈ నెంబర్ ఉంటుంది. కానీ చాలా వరకు దీనిని స్టోర్ చేసుకోరు. అయితే మొబైల్ లోనే ఒక చిన్న నెంబర్ డయల్ చేయడం ద్వారా ఈఎంఐ నెంబర్ తెలిపిస్తోంది. అదేంటంటే?

    ఈ మధ్య ఒకరు ఫోన్ మాట్లాడుతుంటే వేరొకరు వింటున్నారు. దీని వల్ల పర్సనల్ డేటా అంతా బయటకు వెళ్తుంది. ఈ క్రమంలో మన మొబైల్ నెంబర్ పై ఎవరెవరె వింటున్నారో తెలుసుకోవాలంటే *#61# డయల్ చేయాలి. అప్పుడు కాల్ ఫార్వార్డింగ్ నెంబర్స్ డిస్ ప్లే అవుతాయి. ఆ నెంబర్లు మీ మొబైల్ నుంచి సమాచారం తెలుసుకుంటున్నారని అర్థం.

    ఇప్పటి మీ కాల్స్ ఎవరో వింటున్నారని తెలుసుకున్నారు. అయితే ఇప్పటి నుంచి అలా కాకుండా ఉండాలంటే ##02# అనే నెంబర్స్ డయల్ చేయాలి. వీటిని డయల్ చేయడం ద్వారా కాల్ ఫార్వార్డింగ్ ను డిస్ కనెక్ట్ చేసుకోవచ్చు.

    మొబైల్ దొంగిలించగానే పోలీస స్టేషన్లో కంప్లయింట్ చేయాలనుకుంటే ఫోన్ కు సంబంధించి ఈఎంఐ నెంబర్ అడుగుతారు. ఈ నెంబర్ కొందరు స్టోర్ చేసుకోరు. అయితే *#06#నెంబర్ డయల్ చేయడం ద్వారా ఈఎంఐ నెంబర్ వస్తుంది. దీనిని స్క్రీన్ షాట్ తీసి మెయిల్ లేదా ఇతర ఫ్రెండ్ కు పంపించడం ద్వారా ఆ నెంబర్ ఎప్పటికీ సేవ్ అయి ఉంటుంది.