Life Style : ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీ వ్యక్తికి కొన్ని బలహీనతలు ఉంటాయి. బలహీనతలు లేకుండా ఏవరూ ఉండరు. అయితే బలహీనతలు అంటే ఒక్కోరి దృష్టిలో ఒక్కో అర్థం వస్తుంది. బలహీనతల వల్ల లైఫ్‌లో ఎన్నో పొగొట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కోరికి ఒక్కో బలహీనత ఉంటుంది. కొందరు మొహమాటంతో ఎవరు ఏం చెప్పిన వినేయడం, అసలు నో చెప్పలేకపోవడం, మీ ఇష్టాలు కంటే ఇతరుల ఇష్టాలకు ఎక్కువ విలువ ఇవ్వడం వంటివన్నీ కూడా బలహీనతలే. మీకు జాలి గుండె ఉంటే దాన్ని అదునుగా చేసుకుంటారు. నిజం చెప్పాలంటే మీ బలహీనతలే వారికి బలం అవుతాయి. కొందరికి వారి బలహీనతలు కూడా తెలియవు. మీ బలహీనతలు ఏంటో మీరే తెలుసుకుని స్ట్రాంగ్‌గా ఉంటే మీ జీవితానికి మీరే ఇక బాస్. కొందరికి ఇతరులను ఎదిరించలేని బలహీనత ఉంటుంది. అంటే చుట్టాల ఇంటికి వెళ్తే.. మీరు ఒక గంట ఉండి వచ్చేస్తామని అనుకుంటారు. కానీ అవతలి వారు ఈ రోజు ఉండిపో అంటారు. మీరు వారి మాటలను కాదనలేక.. ఉండిపోతారు. ఇది కూడా ఒక రకమైన బలహీనత.
మన బలహీనతలను మనమే గుర్తించి మార్చుకోవాలి. అప్పుడే లైఫ్‌లో ఏదైనా రాణించగలరు. బలహీనతలు ఉన్నాయని కూర్చుని బాధపడితే సరిపోదు. ఎప్పటికప్పుడూ వాటిన రెక్టిఫై చేస్తుండాలి. మీరు మీ బలహీనతలను మార్చుకోవాలంటే ఫస్ట్ ఒక పేపర్‌పై రాయాలి. ఆ తర్వాత వాటిని డైలీ ఫాలో కావాలి. బలహీనతలను మార్చుకోవాలని మీరు గట్టిగా అనుకోవాలి. అప్పుడే వాటి నుంచి విముక్తి పొందుతారు. మనిషికి మరణం ఎలా అయితే తప్పకుండా ఉంటుందో.. అలాగే ప్రతీ మనిషికి కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. వాటి వల్ల మనిషి చాలా ఇబ్బందులు పడతాడు. ఇది వారి లైఫ్‌కే మంచిది కాదని నిపుణులు అంటున్నారు. కొందరికి డబ్బు అంటే పిచ్చి ప్రేమ ఉంటుంది. దీనికోసం ఏ పని అయిన చేస్తారు. తెలుసో తెలియక ఇలా చేయడం వల్ల తర్వాత వారే బాధపడతారు. ఎందుకంటే కోరుకున్న డబ్బు చేతికి రాకపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది.
ఒక మనిషి ఎప్పుడూ కూడా తన బలహీనతలను ఇతరులకు చూపించకూడదు. అవసరానికి తగ్గట్లుగా వాడుకుంటారు. అవసరమైతే మన బలం చూపించాలి.. కానీ బలహీనతలు ఎప్పుడూ చూపించకూడదు. వీటివల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇతరులు ఎవరైనా నీకు ఇది బలహీనత అంటే మార్చుకోరు. ఫస్ట్ అసలు ఒప్పుకోరు. ఇలా ఎవరైనా చెబితే ఒక్క నిమిషం ఆలోచించండి. నిజంగానే అది మీ బలహీనత అయితే వెంటనే మార్చుకోవడానికి ప్రయత్నించండి. అంతే కానీ బలహీనత అని నమ్మితే ఏమనుకుంటారో అని ఫీల్ కావద్దు. బలహీనతలు మీకు లేకపోతే మీ లైఫ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.