https://oktelugu.com/

Marriage : 20, 30 ఏ వయసు పెళ్లికి మంచిది? మీకు 30 దాటిందా?

ప్రతి దేశంలో కూడా యువకులు, యువతులు ఏ వయసులో పెళ్లి చేసుకోవాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంతకంటే ముందు పెళ్లి చేసుకుంటే చర్యలు కూడా తీసుకుంటుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 28, 2024 / 02:00 AM IST

    Marriage

    Follow us on

    Marriage : ప్రతి దేశంలో కూడా యువకులు, యువతులు ఏ వయసులో పెళ్లి చేసుకోవాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంతకంటే ముందు పెళ్లి చేసుకుంటే చర్యలు కూడా తీసుకుంటుంది. ఇక ప్రభుత్వం చెప్పిన వయసు దాటిన తర్వాత ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా మంది 30 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కానీ ఇలా 30 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా? అన్ని రోజులు సింగిల్ గా ఉండవచ్చా? లేదా అనే వివరాలు తెలుసుకుందాం.

    30 సంవత్సరాల వయసు వచ్చేసరికి స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ కూడా పరిణితి పెరుగుతుంది. ఈ వయసులో ఇద్దరు కూడా ఒంటరిగా ఉంటారు. దీని వల్ల జీవితంలో నష్టం జరుగుతుందో లేదో పక్కన పెడితే, వారి లైఫ్ ని మాత్రం మార్చుకోవడంలో ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఇలా ఓ ప్లాన్ తో ముందుకు వెళ్తారు. ఇక ఇరవైల్లో ప్రేమ లేదా పెళ్లి చేసుకోవడంలో కుటుంబానికి దూరంగా ఉండాలి. కానీ ముప్పైల్లో కుటుంబానికి మాత్రం దగ్గరగా ఉండవచ్చు. 20లో పెళ్లి చేసుకుంటే కుటుంబ బాధ్యత మొత్తం నెత్తి మీద పడుతుంది.

    ప్రేమ, పెళ్లి వంటి ఏ నిర్ణయం తీసుకున్నా సరే మంచి నిర్ణయం తీసుకోవడానికి మాత్రం ముప్పై మంచి సమయం అంటున్నారు నిపుణులు. 20 సంవత్సరాల వయసులో మాత్రం చాలా విషయాల్లో క్లారిటీ ఉండదు. సో ఈ విషయాల్లో చాలా గందరగోళం ఉంటుంది. అందుకే 30 తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది. తమకు ఎవరు సరైనవారు అనే క్లారిటీ కూడా వస్తుంది. ఎలాంటి వారు జీవితంలోకి వచ్చినా సమస్యలు రాకుండా చూసుకునే స్టేజ్ కూడా వారికి వస్తుంది.

    ఇక ఇరవైల్లో ఏ విషయానికైనా తొందరపడి భావోద్వేగానికి లోనవుతారు. ముప్పైల్లో ప్రతి విషయంలోనూ ఓపికగా ఉంటుంది. ఎమోషనల్ అవ్వరు. ఆలోచించి నిర్ణయం తీసుకునే స్కోప్ ఎక్కువ ఉంటుంది. సంబంధాల్లో మరింత పరిణతి వస్తుంది. మొండితనం, వాదప్రతివాదాలు, స్వార్థం వంటి చాలా విషయాల్లో కూడా ఓ క్లారిటీ ఉంటుంది. దీనివల్ల సంబంధాలు పెరుగుతాయి కానీ గొడవలు చాలా తక్కువ అంటున్నారు నిపుణులు. ఇక ముప్పైల్లో సింగిల్‌గా ఉన్నవారికి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే సమయం, అవకాశం కూడా ఉంటుందట. ఇది వృత్తి, వ్యక్తిగత జీవితాలను చక్కదిద్దుకునే సమయం కూడా ఇస్తుంది.

    సింగిల్‌గా ఉన్నవారు కొత్త వ్యక్తులను కలవడానికి, కొత్త ప్రదేశాలు చూడటానికి కూడా అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రపంచం గురించి అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ముప్పైల్లో ఒత్తిడి లేకుండా ప్రేమ కోసం వెతకే ఛాన్స్ మీకు ఉంటుంది. తనకు ఏమి కావాలో స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి తనకోసం ఒకరిని చక్కగా ఎంచుకుంటారు.