Rice Bran Oil: మన దేశంలో ఎక్కువగా వినియోగించే వంటనూనెలలో రైస్ బ్రాన్ ఆయిల్ కూడా ఒకటి. మార్కెట్ లో సన్ ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ ధరలతో పోల్చి చూస్తే రైస్ బ్రాన్ ఆయిల్ ధరలు తక్కువగానే ఉన్నాయి. రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రైస్ బ్రాన్ ఆయిల్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చడంతో పాటు మంచి రుచిని కలిగి ఉంటుంది. షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచడంలో రైస్ బ్రాన్ ఆయిల్ తోడ్పడుతుంది.

రైస్ బ్రాన్ ఆయిల్ చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. ఈ ఆయిల్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటు ఇన్ఫెక్షన్లకు చెక్ పెడుతుంది. శరీరానికి ప్రయోజనం చేకూర్చే ఎన్నో విటమిన్లు రైస్ బ్రాన్ ఆయిల్ లో ఉన్నాయి. రైస్ బ్రాన్ ఆయిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ నిరోధక గుణాలను కలిగి ఉంటాయి.
Also Read: IPL 2022 CSK vs LSG: గెలవాల్సిన మ్యాచ్ ఓడిన చెన్నై.. ఐపీఎల్‌లోనే తొలిసారి ఇలా.. ఏంటి జడ్డూ ఇది..?
రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు అయితే తగ్గుతాయని చెప్పవచ్చు. రైస్ బ్రాన్ ఆయిల్ శరీరంలోని కొవ్వును తగ్గించడంలో ఎంతగానో తోడ్పడుతుంది. ఈ ఆయిల్ తో చేసిన వంటకాలను తీసుకోవడం వల్ల హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు అయితే తగ్గుతాయని గుర్తుంచుకోవాలి. రైస్ బ్రాన్ ఆయిల్ లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల వల్ల శరీరానికి మేలు జరుగుతుంది.
మన దేశంతో పాటు ఆసియా ఖండంలో ఇతర దేశాల్లో కూడా రైస్ బ్రాన్ ఆయిల్ ను ఎక్కువగా వినియోగిస్తారు. ఎలాంటి సందేహాలు అవసరం లేకుండా రైస్ బ్రాన్ ఆయిల్ ను తీసుకోవచ్చు. ఇతర వంటనూనెలకు బదులుగా రైస్ బ్రాన్ ఆయిల్ ను కొనుగోలు చేస్తే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ బెనిఫిట్స్ ను పొందవచ్చు.
Also Read: Rana Daggubati: తండ్రి కాబోతున్న హీరో.. వేడుకకు రంగం సిద్ధం ?