Kangana Ranaut Crazy Comments on Rajamouli: రాజమౌళి పై వివాదాల రాణి క్రేజీ కామెంట్స్

Kangana Ranaut Crazy Comments on Rajamouli: హీరోయిన్ లందు కంగనా రనౌత్ వేరయా అన్నట్టు ఉంటుంది ఆమె వ్యవహార శైలి. తనకు సంబంధం లేకపోయినా ఏదొక అంశం పై అడ్డమైన కామెంట్లు చేయడం ఈ బాలీవుడ్‌ బోల్డ్ హీరోయిన్‌ కి బాగా అలవాటు అయిపోయింది. అసలు కంగ‌నా రనౌత్ నోరు తెరిస్తే బూతు సువాసనలు వస్తుంటాయని ఆమె బాధితులు నిత్యం తలా బాదుకుంటూ వెల్లడిస్తూ ఉంటారు. అందుకే.. కంగనా అంటేనే వివాదం.. ఎప్పుడు ఆమె చుట్టూ […]

Written By: Shiva, Updated On : April 1, 2022 3:31 pm
Follow us on

Kangana Ranaut Crazy Comments on Rajamouli: హీరోయిన్ లందు కంగనా రనౌత్ వేరయా అన్నట్టు ఉంటుంది ఆమె వ్యవహార శైలి. తనకు సంబంధం లేకపోయినా ఏదొక అంశం పై అడ్డమైన కామెంట్లు చేయడం ఈ బాలీవుడ్‌ బోల్డ్ హీరోయిన్‌ కి బాగా అలవాటు అయిపోయింది. అసలు కంగ‌నా రనౌత్ నోరు తెరిస్తే బూతు సువాసనలు వస్తుంటాయని ఆమె బాధితులు నిత్యం తలా బాదుకుంటూ వెల్లడిస్తూ ఉంటారు.

Kangana Ranaut

అందుకే.. కంగనా అంటేనే వివాదం.. ఎప్పుడు ఆమె చుట్టూ వంద వివాదాలు కాలక్షేపం చేస్తూ ఉంటాయి. అయితే, తాజాగా ఈ బూతుల మహారాణి పొగడ్తల వర్షం కురిపించింది. దర్శకుడు రాజమౌళిని తాను ఎప్పటికీ అభిమానిస్తూనే ఉంటానని ఈ బాలీవుడ్‌ నటి చెప్పుకొచ్చింది. తాజాగా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని వీక్షించిన కంగనా రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించింది.

జక్కన్నను పొగుడుతూ.. భారత చలనచిత్ర రంగంలో రాజమౌళి గొప్ప దర్శకుడు అని కంగనా తెలిపింది. రాజమౌళి సర్‌.. మిమ్మల్ని రోల్‌ మోడల్‌ గా ఫాలో అవుతున్నందుకు సంతోషిస్తున్నాను. ఎప్పటికీ నేను మీకు అభిమానినే” అని కంగనా ఓ రేంజ్ లో ఎమోషనల్ గా మాట్లాడింది. అసలు కంగనా ఇలా రాజమౌళి పై పొగడ్తలు కురిపించడం బాలీవుడ్ కి నచ్చడం లేదు.

కానీ, టాలీవుడ్‌.. బాలీవుడ్‌లోనే కాదు ఇప్పుడు దేశం మొత్తం ఆర్ఆర్అటు జపం చేస్తోంది. ఇదిలా ఉండగా ఆ సినిమా ప్రారంభంలో వచ్చే ‘కొమ్మా ఉయ్యాల’ సాంగ్ విపరీతంగా నచ్చేసిందని చాలామంది చెబుతున్నారు. ఇంతకీ ఆ పాట పాడింది ఎవరో తెలుసా? ఆ చిన్నారి గాయని పేరు ప్రకృతిరెడ్డి. కర్ణాటకలోని బళ్లారిలో పుట్టిన ప్రకృతి.. తెలుగు, తమిళం, హిందీలోనూ అద్భుతంగా పాడుతుంది. తెలుగు టీవీల్లో ప్రసారమయ్యే షోల్లో కూడా పాల్గొందీ చిన్నారి.

Rajamouli

ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఈ సినిమా ఫస్ట్ వీక్ గానూ అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 391.47 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి కలెక్షన్స్ రావడం తెలుగు సినీ ఇండస్ట్రీకే గర్వకారణం.

Tags