ఈ గణపతికి బంగారం ఇస్తే ధనవంతులు అవుతారట.. ఎక్కడో తెలుసా?

భారతదేశంలోని ప్రజలకు దైవభక్తి ఎక్కువనే సంగతి తెలిసిందే. దేవుడు కోరికలను తీరుస్తాడని ప్రజలలో చాలామంది నమ్ముతారు. కోరికలు తీరిన వెంటనే ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించి భక్తులు తమ మొక్కులను చెల్లించుకోవడం జరుగుతుంది. దేశంలో విఘ్నేశ్వరునికి ఎన్నో ఆలయాలు ఉండగా ఆ ఆలయాలలో ధనిక దగ్దుషేత్ మిఠాయి గణపతి ఆలయం కూడా ఒకటి. మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే నగరంలో ఈ ఆలయం ఉంది. దగ్దుసేత్ అనే స్వీట్ షాప్ యజమాని తన కొడుకు ప్లేగు వ్యాధితో చనిపోగా తన […]

Written By: Kusuma Aggunna, Updated On : November 12, 2021 8:18 am
Follow us on

భారతదేశంలోని ప్రజలకు దైవభక్తి ఎక్కువనే సంగతి తెలిసిందే. దేవుడు కోరికలను తీరుస్తాడని ప్రజలలో చాలామంది నమ్ముతారు. కోరికలు తీరిన వెంటనే ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించి భక్తులు తమ మొక్కులను చెల్లించుకోవడం జరుగుతుంది. దేశంలో విఘ్నేశ్వరునికి ఎన్నో ఆలయాలు ఉండగా ఆ ఆలయాలలో ధనిక దగ్దుషేత్ మిఠాయి గణపతి ఆలయం కూడా ఒకటి.

మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే నగరంలో ఈ ఆలయం ఉంది. దగ్దుసేత్ అనే స్వీట్ షాప్ యజమాని తన కొడుకు ప్లేగు వ్యాధితో చనిపోగా తన కొడుకు జ్ఞాపకార్థం ఈ గుడిని నిర్మించాడు. ఈ ఆలయంలోని గణపతి ఏకంగా ఎనిమిది కిలోల బంగారు ఆభరణాలతో అలంకరింపబడి ఉంటారు. తన అధ్యాత్మిక గురువు సలహా ప్రకారం దగ్దుసేత్ ఈ ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తోంది. ఈ ఆలయంలో విగ్రహాలను ప్రతిష్టించి దగ్ధుసేత్ ఆ విగ్రహాలను కుమారులలా చూసుకున్నారని సమాచారం.

ఆ తరువాత గణేషుడు దగ్ధుసేత్ తో పాటు పూణేవాసులకు కూడా రక్షణ కల్పించాడని ప్రజలు నమ్ముతారు. ప్రతి సంవత్సరం ఏకంగా లక్ష మంది యాత్రికులు ఈ గణపతి దేవుడిని సందర్శిస్తారని తెలుస్తోంది. పదిరోజుల పాటు ఈ గణేష్ చతుర్థి వేడుకలు జరుగుతాయి. ఇక్కడ జరిగే గణేష్ ఉత్సవాలకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం హాజరు కావడం జరుగుతుంది.

ఈ ఆలయంలో పూజలను అందుకుంటున్న గణేష్ విగ్రహానికి 10 మిలియన్లకు బీమా చేయబడింది. ఈ ఆలయానికి 100 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర ఉండగా ఈ ఆలయంలో ఆలయ దీపాలంకరణ అద్భుతంగా ఉంటుంది. బంగారం, డబ్బును దేవునికి కానుకగా ఇచ్చే అవకాశం అయితే ఉండటంతో పాటు బంగారం లేదా డబ్బు ఇస్తే ధనవంతులు అవుతారని ప్రజలు నమ్ముతారు.