Saree: కొత్తగా చీర కట్టుకుంటున్నారా?

ఎడమ వైపున నుంచి చీరని తీసుకుని పెట్టికోట్ లోపలికి టక్ చేయండి. ఓ రౌండ్ టక్ చేసిన తర్వాత.. ఇప్పుడు కుచ్చిళ్ళు తీసుకోవాలి. దీనికోసం చేతివేళ్ళని వాడాలి.

Written By: Swathi Chilukuri, Updated On : June 17, 2024 4:15 pm

Saree

Follow us on

Saree: చీరలోని గొప్పతనం తెలుసుకో.. ఆ చీర కట్టి ఆడతనం పెంచుకో అనే పాట వినే ఉంటారు. నిజంగా చీరలో ఉంటే ఏ అమ్మాయి అని దేవతలా కనిపిస్తుంది కదా. కానీ పద్దతిగా కట్టుకుంటే మాత్రమే ఈ లుక్ వస్తుంది. చీర కట్టుకోవాలని చాలా మందికి ఉన్నా కూడా కట్టుకోవడం మాత్రం కుదరదు. ఇంతకీ చీర కట్టుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా? జస్ట్ సింపుల్ గా ఇలా కట్టేసుకోండి.

మీరు కట్టుకోవాలని ఎంచుకునే చీర కచ్చితంగా 5 నుంచి 9 మీటర్ల పొడవు, 3 అడుగుల వెడల్పు ఉండాలి. ఇవి ఎంబ్రాయిడరీ వర్క్ చీరలు, బాందిని, మధుబని ప్రింట్, బ్లాక్ ప్రింటింగ్, గోటా పట్టి వంటివి తీసుకోండి. మీరు ఏ చీర తీసుకున్న డిజైన్ మాత్రం బాగుండాలి.. కట్టుకోవడానికి కూడా అనువుగా ఉండాలి. మరో ముఖ్యమైన విషయం.. చీరలు చక్కగా కనిపించాలంటే జాకెట్ సరిగ్గా అద్దినట్టుగా ఉండాల్సిందే. అందుకోసం మీకు సరిపోయే విధంగా జాకెట్ కుట్టించుకోవడం. దీంతో పాటు పెట్టీకోట్ కూడా చీర రంగుకి మ్యాచ్ అయ్యేదానిని కొనుక్కోవడం మాత్రం మర్చిపోవద్దు.

ఎడమ వైపున నుంచి చీరని తీసుకుని పెట్టికోట్ లోపలికి టక్ చేయండి. ఓ రౌండ్ టక్ చేసిన తర్వాత.. ఇప్పుడు కుచ్చిళ్ళు తీసుకోవాలి. దీనికోసం చేతివేళ్ళని వాడాలి. చేతి వేళ్ళతో ఎనిమిది, తొమ్మిది మడతలు వేసుకున్న తర్వాత వీటిని సరిగ్గా సెట్ చేసుకొని పెట్టి కోట్ లోపలికి దోపండి. ముఖ్యమైన విషయం చీర కొంగు సరిపడా వచ్చేలా కాస్త వదిలేయండి సుమ. మీకు డైరెక్ట్ కుచ్చిళ్లు లోపలికి టక్ చేయడం రాకపోతే ప్లీట్స్‌కి పిన్ చేసి వాటిని టక్ చేసుకోవాలి. తర్వాత అవసరమనుకుంటే ప్లీట్స్‌కి పిన్ చేసుకోవచ్చు.

చీర కొంగుని తీసుకుని 4, 5 మడతలు పెట్టి ఎడమ భుజంపై పెట్టి పిన్‌ పెట్టండి. ఎక్కడైనా కాస్త మీకు చీర ఎక్స్‌ట్రాగా కనిపిస్తే లాగి పిన్ పెట్టేయండి. ఇలా నీట్ గా చీర కట్టుకున్న తర్వాత మేకప్, జుట్టు సరిచేసుకోండి. చీరలు కట్టుకున్నప్పుడు చీరలకి సెట్ అయ్యే జ్యువెలరీ ని కూడా ఎంచుకోవాలి. కొన్నింటికి సింపుల్‌గా ఉంటే బాగుంటాయి. మరికొన్నింటికి హెవీగా ఉంటే బాగుంటాయి కాబట్టి ఎంచుకునే చీరని బట్టి జ్యువెలరీ ఉండేలా చూసుకోండి.