Alcohol: దేశంలో మద్యం తాగేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే మందుబాబులు మద్యం కొనుగోలు చేసే సమయంలో ఎక్స్‌ఫైర్ డేట్ గురించి అస్సలు పట్టించుకోరు. బీర్ కు, బ్రాందీకి, విస్కీకి ఒక్కోదానికి ఒక్కో విధంగా ఎక్స్‌ఫైర్ డేట్ ఉంటుంది. స్పిరిట్ కేటగిరీలో ఉండే ఆల్కహాల్ కు ఎలాంటి ఎక్స్‌ఫైర్ డేట్ ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వైన్ రకాన్ని బట్టి ఎక్స్‌ఫైర్ డేట్ ఆధారపడి ఉంటుంది.

కొన్ని వైన్ లను సంవత్సరం మాత్రమే తాగే అవకాశం ఉంటుంది. మరికొన్ని రకాల వైన్ లను సంవత్సరాల పాటు కోల్డ్ స్టోరేజ్ లో కచ్చితంగా ఉంచాల్సి ఉంటుంది. అలా కోల్డ్ స్టోరేజ్ లో ఉంచితే మాత్రమే వైన్ మంచి ఆల్కహాల్ గా తయారయ్యే అవకాశం అయితే ఉంటుంది. టేకిలా, వోడ్కా, జిన్, రమ్ లకు ఎలాంటి ఎక్స్‌ఫైర్ డేట్ ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇవి చెడిపోవు కాబట్టి తయారు చేసిన ఎన్ని సంవత్సరాల తరువాతైనా తాగవచ్ఛు.
అయితే బీర్లు, వైన్ కు మాత్రం ఎక్స్‌ఫైర్ డేట్ ఉంటుంది. బీర్లు, వైన్ ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కాబట్టి వీటిని నిర్దిష్ట సమయంలో తాగితే మంచిదని చెప్పవచ్చు. వైన్ ను తయారు చేయడానికి నీళ్లను ఎక్కువగా వినియోగిస్తారనే విషయం తెలిసిందే. అందువల్ల ఇవి త్వరగా పాడయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వైన్ నాణ్యతను బట్టి ఎక్స్‌ఫైర్ డేట్ ను ఫిక్స్ చేయడం జరుగుతుంది.
బీర్ మూత తీసిన తర్వాత కూడా చాలారోజుల వరకు తాగవచ్చు. అయితే నాణ్యతలో మాత్రం తేడా ఉంటుంది. బీర్ ను కొనుగోలు చేసేవాళ్లు తప్పనిసరిగా ఎక్స్‌ఫైర్ డేట్ ను చెక్ చేసుకుని కొనుగోలు చేస్తే మంచిదని చెప్పవచ్చు.