
Digetion : ఇటీవల కాలంలో అందరు పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. మారుతున్న మన జీవనశైలితో అజీర్తి, మలబద్ధకం, కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటి, ఆకలి లేకపోవడం, పేగులు సరిగా శుభ్రం కాకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాం. దీనికి కారణాలు ఏంటని ఆలోచిస్తే మన ఆహార అలవాట్లే. మరుతున్న పరిస్థితుల్లో మన ఆహార అలవాట్లు కూడా మారిపోయాయి. దీంతో మనకు సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మన బాధలను దూరం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే.
మన శరీరానికి తగిన పోషకాలు అందాంటే మనం తీసుకునే ఆహారాల్లో ప్రొటీన్లు ఉండాలి. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కావాలంటే కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. జీర్ణ వ్యవస్థ బాగుంటే దాదాపు 46 రకాల వ్యాధులు మనదరికి చేరవని చెబుతున్నారు. మన ఇంట్లో లభించే వాటితో చూర్ణాన్ని తయారు చేసుకుని వాడితే మలబద్ధకం, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు లేకుండా పోతాయి.

దీనికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర, వాము, సోంపు గింజలు, నల్ల ఉప్పుఉపయోగించాల్సి ఉంటుంది. ఒక పాత్రలో రెండు టీ స్పూన్ల వామును రెండు టీ స్పూన్ల జీలకర్ర తీసుకోవాలి. వీటిని చిన్న మంటపై రెండు నిమిషాలు వేయించాలి. ఇందులో రెండు టీ స్పూన్ల సోంపు గింజల, నల్ల ఉప్పు వేసి పొడి చేసుకోవాలి. తరువాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చూర్ణాన్ని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి.
దీన్ని రోజు ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లలో అర టీ స్పూన్ వేసుకుని కలుపుకోవాలి. రాత్రి భోజనం చేసిన తరువాత తాగాలి. ఇలా తాగడం వల్ల పేగుల్లో పేరుకుపోయిన మలం తొలగిపోతుంది. ఆకలి బాగా వేస్తుంది. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. అజీర్తి సమస్య ఉండదు. దీంతో మన ఆరోగ్య వ్యవస్థ మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.