https://oktelugu.com/

Niharika – Chaitanya: నిహారిక – చైతన్య విడాకులకు బ్రేక్.. సంచలనంగా మారిన లేటెస్ట్ ఫోటో

Niharika – Chaitanya: సోషల్ మీడియా లో గత కొంత కాలం నుండి మెగా అభిమానులను వేధిస్తున్న వార్త నిహారిక కొణిదెల విడాకులు తీసుకోవడమే. 2020 వ సంవత్సరం డిసెంబర్ 9 వ తేదీన ఈ ఇద్దరి పెళ్లి రాజస్థాన్ లోని ఉదయ్ ఘడ్ ప్యాలస్ లో అంగరంగ వైభవం గా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.మెగా హీరోలందరూ కలిసి సంబరాలు […]

Written By:
  • Vicky
  • , Updated On : April 8, 2023 / 01:37 PM IST
    Follow us on

    Niharika – Chaitanya

    Niharika – Chaitanya: సోషల్ మీడియా లో గత కొంత కాలం నుండి మెగా అభిమానులను వేధిస్తున్న వార్త నిహారిక కొణిదెల విడాకులు తీసుకోవడమే. 2020 వ సంవత్సరం డిసెంబర్ 9 వ తేదీన ఈ ఇద్దరి పెళ్లి రాజస్థాన్ లోని ఉదయ్ ఘడ్ ప్యాలస్ లో అంగరంగ వైభవం గా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.మెగా హీరోలందరూ కలిసి సంబరాలు చేసుకున్న సందర్భం అది.

    పెళ్లి తర్వాత ఈ జంట ఒకరిని వదిలి ఒకరు లేనట్టుగా అనిపించారు, అంత అన్యోయంగా ఉంటున్న ఈ జంట విడిపోవడం ఏమిటి అని అభిమానులు ఎంతో బాధ పడ్డారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చొరవ తో వీళ్లిద్దరు మళ్ళీ ఒక్కటైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలం గా నిహారిక అత్తామామలు ఆమె స్వేచ్ఛ కి భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారట. ప్రతీ విషయం లోను ఆంక్షలు పెడుతున్నారట. ఇది నిహారిక కి అసలు ఏమాత్రం నచ్చకపోవడం తో తరచూ గొడవలు జరిగేవట.

    అలా గొడవలు జరగడం వల్లే వీళ్లిద్దరు విడిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రీసెంట్ గానే నిహారిక తండ్రి నాగబాబు వీళ్ళిద్దరిని తీసుకొని చిరంజీవి వద్దకి వెళ్ళాడట. ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఇక కొన్ని షరతుల మీద వీళ్లిద్దరు విడాకులు క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఒక్కటయ్యారని టాక్ వినిపిస్తుంది. వీళ్లద్దరికి సంబంధించిన ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

    Niharika – Chaitanya

    అది రీసెంట్ దే అని కొంతమంది అంటున్నారు. నిహారిక కొణిదెల సినిమాల్లోకి పెద్ద హీరోయిన్ అవుదామనే కోరిక తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది. కానీ ఈమె చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అప్పటి నుండి ఈమె నటనకి గుడ్ బై చెప్పేసి తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లు మరియు సినిమాలను నిర్మిస్తుంది. ఇది కూడా చైతన్య కి ఇష్టం లేదని, వీళ్లిద్దరికీ మధ్య విభేదాలు రావడానికి అది కూడా కారణం అయ్యింది అంటున్నారు.