https://oktelugu.com/

Shanidev: శనివారం శనీశ్వరునికి ఇలా చేస్తే.. మీ సమస్యలు తొలగిపోవడం ఖాయం!

Shanidev: చాలామంది ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలతోనే బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి సమస్యలు సులువుగా తొలగిపోవాలంటే శనివారం రోజు శనీశ్వరునికి పూజ చేస్తే సమస్యలు తొలగిపోవడం ఖాయమని తెలుస్తోంది. శనీశ్వరుడికి శనివారం అత్యంత ప్రీతికరమైన రోజు. ఇక శనీశ్వరుడికి ఆరోజు హిందువులు పూజలు చేస్తూ ఉంటారు. అభిషేకాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఆ రోజు ఆవనూనెతో అభిషేకం చేస్తుంటారు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 12, 2022 2:11 pm
    Follow us on

    Shanidev: చాలామంది ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలతోనే బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి సమస్యలు సులువుగా తొలగిపోవాలంటే శనివారం రోజు శనీశ్వరునికి పూజ చేస్తే సమస్యలు తొలగిపోవడం ఖాయమని తెలుస్తోంది.

    శనీశ్వరుడికి శనివారం అత్యంత ప్రీతికరమైన రోజు. ఇక శనీశ్వరుడికి ఆరోజు హిందువులు పూజలు చేస్తూ ఉంటారు. అభిషేకాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఆ రోజు ఆవనూనెతో అభిషేకం చేస్తుంటారు. అంతేకాకుండా ఆవ నూనెతో దీపం పెడుతూ ఉంటారు. ఇలా శనీశ్వరుడిని ఆవనూనెతో పూజించటం వల్ల సమస్యలన్నీ సులువుగా తొలిగిపోతాయని హిందువుల నమ్మకం.

    మరి శనీశ్వరుడికి ఆవనూననే ఎందుకు అంత ఇష్టం అంటే.. దానికి ఒక కారణం ఉంది. ఓసారి రామాయణ కాలంలో శనీశ్వరుడు తనకున్న బలం, శక్తిని తలుచుకొని తెగ గర్వపడ్డాడు. అదే సమయంలో హనుమంతునికి ఉన్న శక్తి గురించి ఆయనకు తెలియడంతో ఎలాగైనా హనుమంతునితో యుద్ధం చేయాలని శనీశ్వరుడు అనుకున్నాడు.

    అలా శనీశ్వరుడు.. శ్రీరాముని ధ్యానం చేస్తున్న హనుమంతుని దగ్గరికి వెళ్లి యుద్ధం చేయమని సవాలు చేస్తాడు. కానీ హనుమంతుడు యుద్ధాన్ని వద్దంటూ శనీశ్వరుడికి చెప్పగా.. శనీశ్వరుడు మాత్రం ఎంతకు వినలేదు. దాంతో వారి మధ్య గట్టి యుద్ధం జరిగింది. ఇక హనుమంతుడు కొట్టిన దెబ్బలకు శనీశ్వరుడు గాయాలతో, నొప్పితో బాధపడ్డాడు.

    ఇక హనుమంతుడు వెంటనే ఆవనూనెను తీసుకొని శనీశ్వరుడి గాయాలపై పూయడంతో గాయాలన్నీ మాయం అయ్యాయి. ఇక ఆరోజు నుంచి శనీశ్వరుడు తనని ఎవరైతే హృదయపూర్వకంగా ఆవనూనెను సమర్పిస్తారో వారికి ఎటువంటి కష్టాలు ఉండవని వరమిచ్చాడు. అలా అప్పటి నుంచి భక్తులు ఆయనకు ఆవనూనెను సమర్పించి తమ కష్టాల నుండి ఉపశమనం పొందుతున్నారు.