Ratha Saptami 2023: నవ గ్రహాల్లో సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. కనిపించే ప్రత్యక్ష దైవంగా సూర్యుడిని కొలుస్తుంటారు. లోకానికి వెలుగునిచ్చే సూర్య భగవానుడికి ప్రత్యేకంగా మొక్కులు చెల్లిస్తారు. సూర్యుడి ఆరాధనకు మనం చేసే పండుగలలో రథసప్తమి ముఖ్యమైనది. ఈ రోజు సూర్యుడి కిరణాలు ప్రపంచం మొత్తాన్ని ప్రసరింపజేస్తాడు. సూర్యుడి కరుణ మనపై ఉంటేనే అనారోగ్యాలు లేకుండా ఉంటాయి. అలాంటి సూర్యుడి కోసం మనం ఆరాధన చేస్తే మనకు సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

రథసప్తమిని సూర్యుడి జన్మదినంగా భావిస్తారు. రథసప్తమిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. దీంతో రోగ పీడలు తొలగిపోతాయని నమ్ముతారు. రథసప్తమిని మాఘ సప్తమి అని కూడా పిలుస్తారు. రథసప్తమిని వసంత పంచమి తరువాత వచ్చే సప్తమి నాడు రావడం గమనార్హం. రథసప్తమి తితి ఉదయం 5 గంటల 26 నిమిషాల నుంచి 7 గంటల 12 నిమిషాల వరకు ఉంది. దీంతో గంట 46 నిమిషాల పాటు స్నానాలు పూర్తి చేసుకుని సూర్యుడికి పూజలు చేయాలి.
సూర్యుడి ప్రసన్నం కోసం ఇంట్లో సూర్య యంత్రాన్ని స్థాపించడం మంచిది. నీళ్లలో ఎర్ర చందనాన్ని బెల్లంతో నువ్వులు వేసి సూర్యుడికి సమర్పిస్తే అన్నింట్లో విజయం వరిస్తుందని చెబుతుంటారు. సూర్యుడు దానధర్మాలు చేస్తే సంతోషిస్తాడని అంటారు. పేద బ్రాహ్మణుడికి పప్పు, బెల్లం, రాగి, ఎరుపు లేదా కాషాయ వస్త్రాన్ని దానం చేయాలి. జాతకంలో సూర్యుడి స్థానం బలంగా ఉండటం కోసం దానధర్మాలు ఉపయోగపడతాయి. రథసప్తమి ప్రాశస్త్యం గురించి తెలుసుకుని సూర్యుడిని పూజిస్తే ఎన్నో లాభాలు కలుగుతాయి.

రథసప్తమి రోజు సూర్యోదయానికి ముందే తల స్నానం చేసి సూర్యుడిన కొలిస్తే మంచి జరుగుతుంది. సూర్యుడిని కొలవడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని చెబుతారు. అందుకే దీన్ని ఆరోగ్య సప్తమిగా భావిస్తారు. రథసప్తమి రోజు ఇంట్లో కంటే నదుల్లో స్నానం చేయడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇలా రథసప్తమిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుని సూర్యుడి కృపకు పాత్రులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు. అందుకే ఈ రోజు అందరు భక్తితో సూర్యుడిని కొలవాలి.